రాజు గారి గది..రాజు గారి గది..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా ఈ రాజు గారి గది గురించే మాట్లాడుకుంటోంది. ఏ ఇద్దరు కలిసినా ముందు వాళ్లు మాట్లాడుకునేది ఈ రాజు గారి గది గురించే. హీరో శ్రీకాంత్ దగ్గర్నుంచీ మంచు లక్ష్మి దాకా అందరూ ఇప్పుడీ రాజు గారి గది గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. “వాట్ ఈస్ రాజు గారి గది అనేది ఒక మాస్ హిస్టీరియా లా తెలుగు సినిమా ఇండస్ట్రీ” అంతా పాకిపోతోంది. అసలేం జరుగుతోంది!? ఆ గది ఫిలిం నగర్ లో ఎక్కడుందీ!? ” రాజు సింహాసనం తెలుసూ, కిరీటం తెలుసూ కానీ ఈ రాజు గారి గదేంటి..!? తెలిస్తే చెప్పండీ అంటూ సాక్షాత్తు పరుచూరి గోపాల క్రిష్ణే అడిగారు. “30 యియర్స్ ఇండస్ట్రీ” పృద్వీ రాజ్ కి తెలిసినట్టే ఉంది గానీ ఆయన మాత్రం ఆ విషయాలేం బయట పెట్టటం లేదు.
ఐతే బయట కనిపించిన యాంకర్ ప్రదీప్ మాత్రం కొన్ని కీలక విషయాలని బయట పెట్టాడు. 220 బస్ ఎక్కి ఫిలిం నగర్ బస్టాప్ లో దిగగానే అక్కడే ఉన్న పూలమ్మే ఆంటీ ని అడిగితే ఇంకొన్ని వివరాలు తెలియొచ్చు అంటూ సమాచారమిచ్చి హడావుడి గా వెళ్ళిపోయాడు. విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఇప్పుడే తానేమీ చెప్పలేననీ ఆ వివరాలన్నీ సెప్టెంబర్ 17 నే తెలుస్తాయనీ చెప్పారు. వెంకటేష్ గారు కూడా ఈ విషయం లో ఏదో తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. పైకి నవ్వుతున్నా ఏదో జరుగుతున్నట్టే ఉందనిపిస్తోంది… ఈ వీడియో లో సినీ ప్రముఖుల మాటలని మీరే చూడండి…