Home / Political / లెటర్లు లేకపోవడంతో గడ్డి పీకనున్న ఫిన్లాండ్ పోస్టల్ ఉద్యోగులు

లెటర్లు లేకపోవడంతో గడ్డి పీకనున్న ఫిన్లాండ్ పోస్టల్ ఉద్యోగులు

Author:

ఇంటర్నెట్, ఈమెయిల్, వాట్స్ఆప్ లాంటివి వచ్చిన తర్వాత జనాలు ఉత్తరాలు రాయడం మర్చిపొయారు. దానితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పోస్టల్ సంస్థలకు, పోస్టల్ ఉద్యోగులకు పని మరియు ఆదాయం చాలా వరకు తగ్గింది. దానితో ఆదాయం పెంచుకునే వేటలో పడ్డాయి పోస్టల్ కంపనీలూ. మనదేశంలో ఐతే ఇండియన్ పోస్ట్ కొత్త కొత్త స్కీమ్ లు మొదలుపెట్టి ఇంతకుముందు ఎన్నడు లేనన్ని సేవలు అందిస్తుంది.

Finland post to mow customer lawns



ఇక అలా ఆదాయం పెంచుకునే మార్గంలో బాగంగా ఫిన్లాండ్ దేశంలోని పోస్టల్ సంస్థ కొత్త ఉపాయంతో ముందుకు వచ్చింది. ఇకనుండి పోస్టల్ ఉద్యోగులు ఉత్తరాలు పంచడంతో పాటు, ఎవరైన కోరితే వారింట్లో గడ్డిని కూడా కత్తిరిస్తారంట! ఫిన్లాండ్లో పోస్టల్ ఉద్యోగులకు ప్రతి మంగళవారం అసలు పనే ఉండటం లేదు. ఉన్న ఉత్తరాలు అన్ని సోమవారం పంచెస్తున్నారు. సో మంగళవారం ఖాళీగా ఉండకుండా ఎవరైన కస్టమర్ తమ ఇంట్లో బాగా గడ్డి పెరిగింది అని ఫోన్ చేస్తే వెంటనే ఆ లోకల్ పోస్ట్‌మాన్ వెళ్ళి ఆ కస్టమర్ ఇంట్లో గడ్డి కత్తిరించి రావలట. దీనికోసం నెలకు 5000 రూపాయలు రుసుము చెల్లించాలి. దీనికి ప్రజల నుండి మరియు పోస్టల్ సిబ్బంది నుండి కూడా సానుకూల స్పందన లభించింది. తమకు తెలిసిన పోస్ట్‌మాన్ వచ్చి తమ ఇంట్లో గడ్డి కొయడం చాలా కొత్తగా ఉంది అంటున్నారు ప్రజలు. ఆదాయం కోసం ఫిన్లాండ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారి ఆలోచన బాగుంది కదా.

(Visited 260 times, 1 visits today)