Home / Inspiring Stories / 1950 జనవరి 26 న మొదటి గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎలా జరిగాయంటే…!

1950 జనవరి 26 న మొదటి గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎలా జరిగాయంటే…!

Author:

కొన్ని రోజులుగా విపరీతమైన చలి దట్టమైన పొగమంచుతో ఏది కనిపించనై పరిస్థితి.. కానీ ఆరోజు ఎండా విరగ్గాకాసింది.. జరగబోతున్న మహోత్తర ఘట్టానికి శుభ సూచికగా…

ఆరోజు సూర్యుడు ఉదయించక ముందు నుండే ఢిల్లీ వీధుల్లో ప్రజలు త్రివర్ణ పతకాలను చేతపట్టుకుని బారులు తీరారు, మహాత్మగాంధీకి జై… వందేమాతరం నినాదాలు హోరెత్తుతున్నాయి, స్వాతంత్రం వచ్చిన తరువాత జారుతున్న తోలి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న పురానా ఖిలా దగ్గరున్న ఇర్విన్ యాంపి థియేటర్ వద్ద అప్పటికే 15 వేల మంది జనం చేరారు.

First-republic-day-parade-1

ఇంతలో గుర్రపు డెక్కల చప్పుడు…

గుర్రపు బగ్గీపై మనదేశ తోలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్.. ఆ గుర్రపు బగ్గీ వెనుక అశ్వాలపై రాష్ట్రపతి అంగరక్షకులు ఉన్నారు, రాష్ట్రపతి తోలి గణతంత్ర వేడుకలని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన ప్రజలకు చేతులతో అభివాదం చేస్తూ చిరువ్వుతో ముందుకుసాగారు, రాష్ట్రపతితో పాటు ఇండినేషియా అధ్యక్షుడు సుకర్ణో కూడా ముందుకుకదిలారు.. దేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణోని ప్రధాని నెహ్రు ఆహ్వానించారు.

First-republic-day_rajendra-prasad

ధన్ ధన్ మంటూ.. గన్ సెల్యూట్..!
రాష్ట్రపతి, విశిష్ట అధితి రాకకై సూచికగా సైనికులు గన్ సెల్యూట్ చేసారు, తర్వాత జీపులో రాష్ట్రపతి సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు, త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, ఆ తరువాత 1947 – 48 లో కాశ్మీర్ సైనిక ఆపరేషన్ లో పాల్గొన్న నలుగురు సైనికులకు పరమ వీర చక్ర పురస్కారం ప్రదానం చేసారు, అనంతరం 3 వేల మంది సైనికులు పరేడ్ లో పాల్గొన్నారు, అంతమంది పరేడ్ చూడటం.. మనదేశంలో అదే తొలిసారి ప్రజల సంతోషానికి హద్దుల్లేవ్.. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు లేవు..ప్రధాని నెహ్రూతో పాటు మంత్రులందరూ ప్రజలని నేరుగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు, మొత్తంగా తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు 2 గంటల సేపు అట్టహాసంగా జరిగాయి, దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ మహత్తర ఘట్టానికి సూచికగా ఆరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ ను తొలిసారిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది.

First-republic-day_parade

మరికొన్ని విశేషాలు..

  • జనవరి 26 ని రిపబ్లిక్ డే గా ప్రకటించడం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, 1930 జనవరి 26 నే భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలంటూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
  • గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే అందరికి రాజ్ పథ్ గుర్తొస్తుంది, కానీ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగింది మాత్రం ఇర్విన్ యాంపిథియేటర్ లో (ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం) ఆ తరువాత వేరువేరు ప్రదేశాలలో చేసిన 1955 నుండి రాజ్ పథ్ లో చేస్తున్నారు.
  • ”ఈరోజు నాకు, మీకు, మనతో పాటు మన కుక్కలకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది” అంటూ సైనికాధిపతి కరియప్ప భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరియప్ప ప్రసంగం. అక్కడివారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపాయి.

 

 

Credits: Sakshi.com

(Visited 403 times, 1 visits today)