Home / Entertainment / ఫ్లిప్‌కార్ట్ సరఫరా, లాజిస్టిక్స్ విభాగాన్ని పెంచడానికి 30వేల ఉద్యోగాలు.

ఫ్లిప్‌కార్ట్ సరఫరా, లాజిస్టిక్స్ విభాగాన్ని పెంచడానికి 30వేల ఉద్యోగాలు.

Author:

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదు రోజులపాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించనుంది. భారీ ఆఫర్లు ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నా అందుకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు వరకు వెల్లడించలేదు. తాజాగా స్మార్ట్‌ఫోన్లపై ఇవ్వనున్న రాయితీలు, ఆఫర్ల వివరాలను బయటపెట్టింది.

ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన నాలుగో ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు నిర్వహించబోతుంది. ఈ సేల్‌ జరిగే సమయంలో, ఫ్లిప్‌కార్ట్‌ విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.

Flipkart has hired 30,000 people to bolster its supply chain and logistics unit

తమ వినియోగదారులకు సజావుగా షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. సప్లయి చైన్‌ వ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సీజనల్‌ ఉద్యోగాలను కల్పించింది. వీటిలో వేర్‌హౌజ్‌లు, మదర్‌ హబ్స్‌, డెలివరీ హబ్స్‌ ఉన్నాయి. ప్యాకేజింగ్‌, వేర్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌లలో అదనంగా పరోక్ష ఉద్యోగాలను కూడా సృష్టించింది ఫ్లిప్‌కార్ట్‌. ప్రస్తుతం నియమించుకున్న ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ఉద్యోగులు టెక్‌తో నడిచే సప్లయి చైన్‌, ఫుడ్‌ టెక్‌, ఇతర సంబంధిత పరిశ్రమల్లో పనిచేసేందుకు ఈ అనుభవం ఉపయోగపడనుంది.

(Visited 1 times, 1 visits today)