Home / Inspiring Stories / పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు ఈ విషయాలని పట్టించుకోకపోతే మీ వాహనం త్వరగా పాడైపోతుంది.

పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు ఈ విషయాలని పట్టించుకోకపోతే మీ వాహనం త్వరగా పాడైపోతుంది.

Author:

ఇప్పుడు ధనిక, మధ్యతరగతి, పేద అనే భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఎదో ఒక వాహనం ఉపయోగిస్తున్నారు, రవాణా కోసం కొన్ని లక్షలాది వాహనాలు నడుస్తున్నాయి, దేశం మొత్తమ్మీద దాదాపు 4.5 కోట్లకి పైగానే వాహనాలు ఉన్నాయి, ఈ వాహనాలు అన్ని నడవటానికి కావాల్సింది పెట్రోల్ లేదా డీజిల్, కొన్ని వాహనాలు మాత్రమే గ్యాస్ తో నడుస్తున్నాయి, ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంక్ లలో మోసాలు బాగా ఎక్కువైపోయాయి, పెట్రోల్ పంప్ లో చిప్ లని పెట్టి తక్కువ పెట్రోల్/ డీజిల్ ని పోయటం, ఇంధనాన్ని కల్తీ చేయటం చాలా సాధారణం అయిపోయాయి, ఇలాంటి మోసాలను గుర్తించాలంటే మనం ఇంధన కల్తీపై అవగాహన పెంపొందించుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ తదితర ఇంధనాల వాడకంపై నాణ్యత, ప్రమాణాలు, కొలమానం తప్పనిసరిగా సరి చూసుకోవాలి. కల్తీ ఇంధనాన్ని వాడటం వల్ల వాహనాలు చాలా త్వరగా మెకానిక్ షెడ్ కి చేరుతున్నాయి, త్వరగ్గా బోర్ కి వచ్చి 10 సంవత్సరాలు ఉండాల్సిన ఇంజిన్ 5 సంవత్సరాలకే పాడైపోతుంది, కల్తీ ఇంధనం వల్ల వాతావరణం కూడా పాడైపోతుంది.

Petrol-Bunk-Cheating

కల్తీ ఇంధనాన్ని గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి:

పెట్రోల్‌ ఫిల్టర్‌ టెస్ట్‌ పేపర్‌:

కల్తీ ఇంధనాన్ని చాలా సులభంగా గుర్తించడానికి పెట్రోల్ ఫిల్టర్ పేపర్ ఉపయోగపడుతుంది, ఇంధనం కల్తీ జరిగింది అని అనుమానం వస్తే ఈ పెట్రోల్‌ ఫిల్టర్‌ టెస్ట్‌ పేపర్‌ పై ఒక చుక్క పెట్రోల్ ని వేస్తే కొద్దిసేపటి తరువాతపేపర్‌పై మరక ఉంటే అది కల్తీ పెట్రోల్ అని, మరక లేకపోతే కల్తీ జరగలేదని నిర్దారించుకోవచ్చు, ప్రతి పెట్రోల్ బంక్ లో ఈ ఫిల్టర్ పేపర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, కల్తీ జరిగితే వెంటనే సివిల్‌ సప్లయి అధికారులకు ఫిర్యాదు చేయాలి.

ఇంధనం నాణ్యతని చెక్‌ చేసుకోవచ్చు:

ఇంధనం నాణ్యత పై అనుమానం వస్తే ప్రతి పెట్రోల్ బంక్ లో ఉండే పరికరాలతో చెక్ చేసుకోవచ్చు, ప్రతి బంక్ లో డెన్సిటీ హైడ్రో మీటర్‌, పెట్రోల్‌ ఫిల్టర్‌ టెస్ట్‌ పేపర్‌, 5 లీటర్ల కొలమానంతో ఇంధన సాంద్రత, నాణ్యత ని కొలిచే పరికరాలు ఉంటాయి వాటితో పరీక్షించుకోవచ్చు, కొలతలు, హెచ్చు తగ్గులుంటే లీగల్‌ మెట్రాలజీ అధికారులకు, నాణ్యతా ప్రమాణాలకు సివిల్‌ సప్లయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే వినియోగదారుల ఫోరమ్‌లో సైతం ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది, ఒకవేళ బంక్ లో పరికరాలు అందుబాటులో లేకున్నా, వారు ఇవ్వకున్నా అధికారులకి ఫిర్యాదు చేయవచ్చు.

డెన్సిటీ హైడ్రో మీటర్‌:

డెన్సిటీ హైడ్రోమీటర్‌తో పెట్రోల్‌, డీజిల్‌ సాంద్రతను పరిశీలించవచ్చు. దీనిలో ఇంధనాన్ని మిల్లీలీటర్లలో కొలుస్తారు. సాధారణం గా డెన్సిటీ హైడ్రో మీటర్‌లో పరిశీలించేటప్పుడు పెట్రోల్‌ 0.700నుంచి 0.750 మి.లీ వరకు వస్తే సరైన సాంద్రత ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా డీజిల్‌లో 0.800 నుంచి 0.805 మి.లీ వరకు ఉంటే సరైన సాంద్రత ఉన్నట్లు తెలుస్తుంది.

ఇంకొన్ని సార్లు పెట్రోల్ పంప్ లలో చిప్ లని అమర్చి రీడింగ్ మార్చి తక్కువ తక్కువ ఇంధనాన్ని పోస్తున్నట్లుగా అనుమానం వస్తే బంక్ లలో ఉండే 5 లీటర్ల కొలమానంతో ఇంధనాన్ని దానిలో పోసి చెక్ చేసుకోవచ్చు.

వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఇంధనం కోసం బంక్ కి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటం, ఏమరుపాటుగా ఉండటం చేయకూడదు.
  • ఇంధనాన్ని పోసేటప్పుడు జీరో రీడింగ్ ని ఖచ్చితంగా గమనించాలి.
  • కల్తీ జరిగిందని అనుమానం వస్తే వెంటనే పెట్రోల్ ఫిల్టర్ టెస్ట్ పేపర్ పై చెక్ చేయాలి.
  • తక్కువ పోసినట్లుగా అనుమానం వస్తే బంక్ లో ఉండే 5 లీటర్ల కొలమానంతో చెక్ చేయాలి.
  • ఇంధనం నాణ్యత పై అనుమానం వస్తే డెన్సిటీ హైడ్రో మీటర్ తో పరీక్షించాలి. మోసం చేస్తున్నారని తేలితే వెంటనే అధికారులకి ఫిర్యాదు చేయాలి.
  • పెట్రోల్‌ పోసే యంత్రంపై లీటల్‌ మెట్రాలజీ శాఖ ముద్రను గమనించాలి.

మనం వాడే ఇంధనం పైనే మన వాహనం జీవితంకాలం ఆధారపడి ఉంటుంది, కల్తీ ఇంధనాన్ని వాడటం వల్లనే చాలా వాహనాలు త్వరగా పాడైపోతున్నాయి కానీ మనం దానిని గుర్తించక వేరే కారణాలని వెతుక్కుంటున్నాం, ఇప్పటినుండైనా జాగ్రత్తగా ఉండి బంక్ వారు చేసే మోసాలని కనిపెట్టండి.

Source: AndhraJyothi

Must Read: వాహనం కొనేటప్పుడు మీ బిల్ ఒకసారి చెక్ చేసుకొని షో రూం వాళ్ళు చేసే మోసాన్ని కనిపెట్టండి.

(Visited 2,490 times, 1 visits today)