Home / health / పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

Author:

సమయానికి తిని, కంటి నిండా నిద్రపోతే ఎటువంటి అనారోగ్యాలు మన దరికి చేరవు, కాని మనం మాత్రం టైం కి తినం, టైం కి నిద్రపోము కాని అనారోగ్యం మాత్రం రావొద్దు అనుకుంటాం, ప్రతి జీవికి నిద్ర అనేది చాలా అవసరం, సరిగ్గా నిద్ర పోకపోతే చాలా రోగాలు వస్తాయి, రోజుకి సరిపడా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని చాలా పరిశోధనలు తేల్చి చెప్పాయి, కాని ఈ రోజులలో మనకు సవాలక్ష పనులు, సమస్యలు, ఒత్తిళ్ళు, వీటిని అధిగమించాలంటే సరిపడా నిద్ర అంత్యంత అవసరం, చాలా మందికి పడుకున్న కూడా నిద్ర సరిగ్గా పట్టక రాత్రిలో చాలా సమయం లేచే ఉంటారు, అర్ధ రాత్రి పడుకొని ఉదయం లేటుగా లేస్తారు, ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్లనే ఎక్కువ మంది అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తోంది, అయితే అలాంటి వారు కింద ఇచ్చిన ఓ సింపుల్ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్‌ను ఫాలో అయితే ప‌డుకున్నాక కేవ‌లం ఒక నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకోవ‌చ్చు. ఆ ట్రిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప‌డుకున్నాక కేవ‌లం ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకోవాలంటే ఓ ట్రిక్‌ను ఫాలో అవాలి. అయితే అందుకోసం ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌డం, ట్యాబ్లెట్లు మింగ‌డం లాంటి ప‌నులు చేయాల్సిన ప‌నిలేదు. సింపుల్‌గా శ్వాస తీసుకోవ‌డంపై నియంత్ర‌ణ ఉంటే చాలు. ఈ ట్రిక్‌ను ఎవ‌రైనా ప్ర‌యత్నించ‌వ‌చ్చు. దీన్నే ‘4-7-8 బ్రీత్ టెక్నిక్’ అని పిలుస్తారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్‌ను క‌నుగొన్నారు.

sleep-trick-

పైన ఫోటోలో చూపిన విధంగా నాలుక‌ను నోటి లోప‌ల పై భాగాన్ని తాకేలా ఉంచాలి. అలా ఉంచాక 4 సెక‌న్లు లెక్కబెడుతూ శ్వాస‌ను లోప‌లికి ముక్కు ద్వారా పీల్చాలి. అనంత‌రం 7 సెక‌న్లు లెక్కబెడుతూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు లెక్కబెడుతూ శ్వాస‌ను మొత్తాన్ని నోటి ద్వారా బ‌య‌ట‌కు పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 4 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులలోనే మీరు మార్పుని గమనించగలుగుతారు, ఇలా పడకున్న వెంటనే అలా నిద్రలోకి జారిపోయి కలలలో విహరిస్తారు.

Must Read:10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 64,744 times, 1 visits today)