Home / health / మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినడం మానేయండి..!

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినడం మానేయండి..!

Author:

అధిక బరువు ప్రస్తుతం అనేక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య, అధిక బరువు సమస్య వచ్చిందంటే చాలు దానితో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి, మన నిర్లక్ష్యం కారణంగా అధిక బరువు సమస్యని త్వరగా తగ్గించుకోకపోతే భవిష్యత్ లో అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సిందే, ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ లైఫ్ లలో ఎప్పుడు తింటున్నామో, ఏది తింటున్నామో కూడా అని ఆలోచించే టైం కూడా లేకుండా పోయింది, ఏది పడితే అది తిని అధిక బరువు సమస్యని తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు, అలాంటి వారు బరువు తగ్గాలని బాగా ప్రయత్నిస్తారు కానీ తగ్గలేకపోతారు, బరువు తగ్గాలంటే వ్యాయామం చేయటంతో పాటు కొన్ని ఆహార పదార్థాలని తినకుండా దూరం పెడితేనే ఫలితం ఉంటుంది.

మన ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు అధిక కెలోరీలను కలిగిఉంటాయి, బరువు తగ్గాలని అనుకునే వారు ఎక్కువ కెలొరీస్ ని ఇచ్చే ఫుడ్ ని దూరం వాటి స్థానంలో బరువు తగ్గడానికి దోహదపడే ఫుడ్ ని తీసుకుంటే చాలా త్వరగా అనుకున్న ఫలితాలని సాధిస్తారు, అనేక వైద్య పరిశోధనల ప్రకారం బరువు ఎక్కువగా పెరగడానికి దోహదపడే ఫుడ్ ఐటమ్స్ వివరాలు కింద ఉన్నాయి, వాటిని దూరం పెట్టి బరువు తగ్గాడనికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

అధిక బరువు weight lose tips

శరీర బరువుని పెంచే ఆహార పదార్థాలు:

ఆలుగడ్డ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్:

ఆలుగడ్డ ఆరోగ్యానికి మంచిదే కానీ ఆలుగడ్డతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ మాత్రం బరువుని బాగా పెంచేస్తాయి, అధిక కెలోరీలని కలిగి ఉండి త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి.

చాకోలెట్స్, ఐస్ క్రీమ్స్:

బరువు తగ్గాలనుకునేవారు ఐస్ క్రీమ్స్, చాకోలెట్స్, క్యాండీ బార్స్ తినడం పూర్తిగా మానేయాల్సిందే, ఇవి చిన్న పరిమాణంలో ఉండి అధిక కెలోరీలని ఇస్తాయి.

ఫ్రూట్ జ్యూస్ లు:

ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి మంచిదే కానీ అందులో ఉండే షుగర్ అధిక కెలోరీలని శరీరానికి అందిస్తుంది, ఇంట్లో చేసుకునే ఫ్రూట్ జ్యూస్ లు కాకుండా బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ లు చాలా ప్రమాదకరం.

కేక్స్, కుకీస్, బ్రెడ్ :

కేక్స్, కుకీస్, పేస్ట్రీలు, బ్రెడ్ లు అధిక శాతం షుగర్, అధిక కెలోరీలని ఇచ్చే పదార్థాలని కలిగి ఉంటాయి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని దూరం పెట్టడం చాలా మంచిది.

ఆల్కహాల్ :

బరువు తగ్గాలనుకునే వారు అధికంగా ఆల్కహాల్ తాగడం ముఖ్యంగా బీర్ తాగడం అస్సలు మంచిది కాదు, పరిమితగా ఆల్కహాల్ లేదా పూర్తిగా తాగకుండా ఉంటడం చాలా మంచిది.

వీటితో పాటు ప్రతిరోజు అధిక ఆహరం కాకుండా శరీరానికి సరిపడా మిత ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు పైన చెప్పిన ఆహార పదార్థాలని పూర్తిగా మానేసి మిగతా ఆహార పదార్థాలని కూడా తగ్గించి కోడి గుడ్లు, ఆకుకూరలు, చేపలు విరివిగా తీసుకుంటే అధిక బరువు సమస్య నుండి త్వరగా బయట పడుతారు. ఈ విషయాన్నీ అందరికి షేర్ చేయండి.

Also Read:  Video: రోజు ఇలా 5 నిముషాలు చేస్తే నెల రోజులలో పొట్టని పూర్తిగా తగ్గించుకోవచ్చు.

(Visited 464 times, 1 visits today)