Home / Inspiring Stories / గుంటూరు జనరల్ హాస్పిటల్ లో పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు.

గుంటూరు జనరల్ హాస్పిటల్ లో పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు.

Author:

గుండెకు శస్త్రచికిత్స (హార్ట్ ఆపరేషన్) అంటేనే లక్షలతో కూడుకున్న వ్యవహారం. చాల మంది పేద ప్రజలు ఆ చికిత్సకు డబ్బులు లేక గుండె సంభందిత వ్యాధులతో చనిపోతున్నారు. అలా చనిపోతున్న వారిలో చాలా మంది చిన్నారులు ఉంటున్నారు. పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు పడి లేదా గుండె సంభందిత వ్యాదులతో బాధపడే చిన్నారులకు ఇంత వరకు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేసే సదుపాయాలు లేవు. కాని జనవరి 1 నుండి గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ అల్లా గోపాల కృష్ణ గోఖలే గారి సహృదయ ట్రస్ట్ తరపున ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు ప్రకటించారు.

free-heart-operations-in-guntur

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరగనున్న ఈ ఆపరేషన్లకు బాధితుల నుండి డబ్బు తీసుకోరు. ఇలాంటి ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే రూ .2 లక్షల కంటే ఎక్కువ చెల్లించవలసి వుంటుంది. ఎవరైనా పేదల పిల్లలు గుండె సంభదిత వ్యాదులతో బాధపడుతూ ఉంటె వెంటనే తమ వివరాలను GGH ప్రాంతీయ వైద్య అధికారి డాక్టర్ రమేష్ గారిని కలిసి తమ పేరు నమోదు చేయించుకోవాలి. ఇప్పటివరకు GGH లో 260 హృదయ శస్త్రచికిత్సలు మరియు రెండు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. కాని ఇప్పుడు మొదటిసారిగా చిన్న పిల్లలకు ఈ చికిత్సలు చేయనున్నారు. మీకు తెలిసిన చిన్నారులు ఎవరైనా గుండె సంభందిత వ్యాధులతో బాధపడుతుంటే వారికి ఈ విషయం తెలియజేయండి.

(Visited 217 times, 1 visits today)