Home / health / పీల్చే గాలిని కూడా కోనుక్కోవాల్సిన రోజులు వచ్చాయి మన దేశంలో.

పీల్చే గాలిని కూడా కోనుక్కోవాల్సిన రోజులు వచ్చాయి మన దేశంలో.

Author:

స్వచ్ఛమైన గాలి పీల్చడానికికూడా డబ్బు చెల్లించాల్సి వుంటుందా? ఢిల్లీ ప్రజలకు ఆ పరిస్థితి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత విషతుల్యమైన గాలి కల నగరంగా ఢిల్లీని గుర్తించింది. కెనడాకు చెందిన వైటాలిటీ ఎయిర్ అనే సంస్థ సహజమైన గాలి ని క్యాన్లలో నింపి అమ్ముతుంది.వారు దీన్ని ఇండియాలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఒక్క సారి పీల్చుకోవడానికి 12.50 రూపయలగా దీని ధర నిర్ణయించారు .

fresh-air-cans-are-for-sale-in-delhi

చైనా రాజధాని బీజింగ్ లో దీని అమ్మకాలు కోనసాగిస్తున్నట్టు, ఢిల్లీ పొగమంచు బీజింగ్ కు సమానంగా ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ స్థాపకుడు మోసెస్ లామ్ మార్కెట్ లోకి ఒక సంచలనమైన ఉత్పత్తిని తేవాలని భావించి ఈ క్యాన్డ్ ఏయిర్ ఆలోచనతో ప్రవేశించాడు. చైనాకు 12,000 కిట్ లను దిగుమతి చేసారు. ఈ ఎయిర్ ను క్యాన్లలో కుదించబడిన గాలి రెండు ఫ్లేవర్స్ లో లభ్యమవుతుంది. అవి బాన్ఫ్ మరియు లేక్ లూయీస్.

Vitality-Air

ఈ గాలిని మాస్క్ ల ద్వారా పీల్చాల్సి వుంటుంది. 3-లీటర్లు, 8-లీటర్ల క్యాన్స్ లో లభ్యమవుతుంది. వీటి ఖరీదు రెండు కలీపి 1,450 నుండి 2,800 రూ.మధ్యలో వుంటుంది, ఇది భారతదేశంలో వాడవల్సిన పరిస్థితి వస్తే మనం సిగ్గు పడవల్సిన విషయమే సహజ వనరులకు చెల్లించ వలసి రావడం. ఇప్పటి వరకు దేశం లోని వివిధ ప్రాంతాలలో నీటి కోసం డబ్బు వెచ్చిస్తున్నాం.పరిస్థితి మరింత దిగజారి గాలికోసం చెల్లించాల్సి వస్తుంది.

ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. త్వరలోనే పీల్చేగాలినీ కొనుక్కోవలసి రావడం ఆందోళనకరం. అందురూ డబ్బు వెచ్చించే పరిస్థితుల్లో లేరు కూడా , బెంగుళూరులో కూడా పరిస్థితి విషమంగానే వుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధనల ప్రకారం వచ్చె 5 సంవత్సరాలలో నగరం నివాసయోగ్యం కాకుండా అవుతుంది. ఇకనైనా కాస్త ప్రకృతి మేద ద్రుష్టి పెడితే ,కాస్త చెట్లని కూడా బ్రతకనిస్తూ ,కార్లు ద్విచక్ర వాహనాల వినియోగం తగ్గిస్తూ లోకల్ బస్సులూ,ట్రైన్లలో ప్రయాణిస్తే ప్రమాదాన్ని ఎంతోకొంత తగ్గించుకోవచ్చేమో

(Visited 408 times, 1 visits today)