Home / Entertainment / లీకైన గౌతమిపుత్ర శాతకర్ణి లొకేషన్ ఫొటోస్.

లీకైన గౌతమిపుత్ర శాతకర్ణి లొకేషన్ ఫొటోస్.

Author:

నందమూరి అందగాడి 100వ సినిమా ఎనౌన్సె చేసినప్పటి నుండీ, అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు, అందులోనూ అది అచ్చంగా బాలయ్యకి సెట్ అయ్యే, ఒక్క బాలయ్య మాత్రమే చెయ్యగలిగే సినిమా అవ్వటంతో ఖచ్చితంగా ఇది మేము కాలర్ ఎగరేసుకునే సినిమా అనీ, మా బాలయ్య కెరీర్లో ఓ అతిముఖ్యమైన ఘట్టానికి సరైన కథ, సరైన దర్శకుడు, తెలుగు సినిమా రికార్డ్లు తిరగారాయబోయే సినిమా అని గొప్పగా చెప్పుకుంటున్నారు, మరో వైపు డైరెక్టర్ క్రిష్ కూడా నా కథకు 100% న్యాయం చేయగల హీరో దొరకటం నా అదృష్టం అనీ, బాలయ్య తప్ప ఇంకెవ్వరూ ఈ కథకి న్యాయం చెయ్యలేరనీ, చెప్పటంతో ఫాన్స్ మరింత ఆనందంలో ఉన్నారు.

అయితే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పై నిర్మాతలు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నట్టు, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా క్వాలిటీ మీదనే దృష్టి పెట్టినట్టు మొరాకో లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంతాన్ని చూస్తే ఈసీ గా తెలిసిపోతుంది. ఇప్పటివరకూ కంప్లీట్ అయిన సన్నివేశాలలో బాలయ్య డైలాగులు ఇరగదీసాడట, క్రిష్ ఆస్థాన రచయత ఈసారి తన పెన్నుకి మరింత పదును పెట్టాడంట. ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులని ఈ విషయాలు మరింతగా ఊరిస్తున్నాయి కదా … అప్పటి వరకూ అభిమానులకి మా తరపున ఈ ఎక్స్ క్లూసివ్ షూటింగ్ స్పాట్ ఫొటోస్.

Gautamiputra-Satakarni-Locations Leaked Photos

Gautamiputra-Satakarni-Locations

(Visited 881 times, 1 visits today)