Home / health / తీవ్రమైన పంటి నొప్పి నుండి సెకండ్లలో ఉపశమనం పొందండి.

తీవ్రమైన పంటి నొప్పి నుండి సెకండ్లలో ఉపశమనం పొందండి.

Author:

పంటినొప్పి ఈ భాదను దాదాపు అందరూ అనుభవించే ఉంటారు. చిన్న, పెద్ద అనే భేదం లేకుండా అన్ని వయసుల వారు వివిద రకాల పంటినొప్పితో భాదపడుతుంటారు. ఆ నొప్పి కి చిగుళ్ళ సమస్యలు, విరిగిన పళ్ళు, అంటువ్యాధులు, గాయాలు, జాయింట్ సమస్యలు, దంత క్షయం వంటి చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలకు దంతవైద్యుడుని సంప్రదించాలి కాని మీకు వైద్యుడు అందుబాటులో లేకపోతే పంటినొప్పితో కష్టాలు అన్ని ఇన్ని కావు. నిద్ర పట్టదు, ఆకలిగా ఉన్న ఏమీ తినలేము. అలాంటి వీరికోసమే సహజ పద్దతిలో ఇంట్లో దొరికే సామాన్లతోనే తీవ్రమైన పంటినొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

 పంటి నొప్పి నుండి సెకండ్లలో ఉపశమనం పొందండి.

పంటినొప్పి నుండి ఉపశమనం కలగడానికి మనకు కావాల్సిన పదార్దాలు:

  • లవంగాల పొడి.
  • కొబ్బరి నూనె.

ఒక గ్లాసులో అర టీ స్పూన్ లవంగాల పొడి ని కొబ్బరి నూనెతో పేస్ట్ లాగ కలపాలి. అల కలిపిన మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న పంటిపై మరియు చిగుళ్ళపై రుద్దాలి. ఇలా చేసిన వెంటనే ఈ మిశ్రమం యొక్క ప్రభావం పంటిపై పని చేస్తుంది. లవంగాలలో ఉండే ఉగెనొల్ అనె రసాయనం మరియు కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ తత్వం కలిసి పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇలా రోజుకు 3 సార్లు చెస్తే మరింత ఉపశమనం కలుగుతుంది. తద్వార మీరు మీ పనులు పూర్తి చేసుకుని తర్వాత దంతవైద్యుడుని కలవచ్చు.

Must Read: మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

(Visited 9,336 times, 1 visits today)