Home / Inspiring Stories / కంపనీ మార్కెటింగ్ కాల్స్, మెసేజ్ లతో విసిగిపోయారా? ఐతే ఈ విధానం పాటిస్తే నీ మొబైల్ కి ఇక మార్కెటింగ్ కాల్స్ రావు.

కంపనీ మార్కెటింగ్ కాల్స్, మెసేజ్ లతో విసిగిపోయారా? ఐతే ఈ విధానం పాటిస్తే నీ మొబైల్ కి ఇక మార్కెటింగ్ కాల్స్ రావు.

Author:

how to get rid of unwanted marketing calls

మనం మన పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మన ఫోన్ మొగుతుంది. చేసే పని ఆపి ఫోన్ తీసి చూస్తే, ఆది కస్టమర్ సర్విస్ నుండో, లేకపోతే ఏదైన మార్కెటింగ్ కాల్ ఐతే మనము ఎంత చిరాకు పడతామో అందరికి తెలిసిందే. మరికొంత మంది తమకు ఇష్టం ఉన్న రంగాలలో అప్‌డేట్స్ కోసం రిజిస్టర్ ఐతే వారికి అన్ని రంగాల నుండి అప్‌డేట్స్ వచ్చి చిరాకు పడుతుంటారు. ఇకపై అలాంటి మార్కెటింగ్ కాళ్ల్‌స్‌ను, మెసేజ్ లను మనం పూర్తిగా మన ఫోన్ కి రాకుండా చేయవచ్చు.

భారతీయ టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ సామాన్య ప్రజల బాధలను గుర్తించి, ఒక కొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది మరియు ఈ సర్విస్ పూర్తిగా ఉచితం. కేవలం మీ ఫోన్ నుండి 1909 అనే నంబర్ కి START 0 అని SMS పంపిస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఒకసారి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీ మొబైల్కి ఎటువంటి మార్కెటింగ్ కాల్స్ కానీ మెసేజ్ లు కానీ రావు. అలా వస్తే మీరు ఇంకో సారి ఆ మెసేజ్ పంపిన వారి వివరాలు 1909 కి The Unsolicited Commercial Communication, XXXXXXXXXX, dd/mm/yy  (xxx- is sender) అని టైప్ చేసి పంపిస్తే వారి మీద కేసు నమోదు అవుతుంది మరియు మరో 7 రోజులలో మీ ఫిర్యాదు కు ఎటువంటి చర్య తీసుకున్నారో కూడా తెలుపుతారు.

మీకు కొన్ని రంగాల నుండి మార్కెటింగ్ కాల్స్ రావాలంటే కింద తెలిపిన విధముగా చెయ్యండి.

To opt for the fully blocked category, send SMS “START 0” to 1909.
To opt for the partially blocked category, send SMS “Start ” to 1909 as below

  • START 1 for receiving SMS relating to Banking/ Insurance / Financial products/Credit cards
  • START 2 for receiving SMS relating to Real Estate
  • START 3 for receiving SMS relating to Education
  • START 4 for receiving SMS relating to Health
  • START 5 for receiving SMS relating to Consumer goods and automobiles
  • START 6 for receiving SMS relating to Communication/ Broadcasting/ Entertainment /IT
  • START 7 for receiving SMS relating to Tourism and Leisure

మీరు ఈ సర్విస్ నుండి బయటకి వచ్చి, మళ్లీ అన్ని మార్కెటింగ్ కాల్స్, మెసేజ్ లు రావాలంటే 1909 కి STOP అని టైప్ చేసి SMS పంపితే చాలు. సో పై విధానాన్ని పాటించి మార్కెటింగ్ కాల్స్ నుండి విముక్తి పొందండి. కొన్ని మొబైల్ ఆపరేటర్లకు 1909 కి ఉచితం గా కాల్ చేసి కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

 

Source: https://factly.in/tired-of-unsolicited-calls-and-texts-here-is-what-you-can-do

Must Read: నటించడం లో జీవించీ, జీవించడం లో ఓడిపోతున్నారా…!

(Visited 32,675 times, 1 visits today)