Home / health / ఆలుగడ్డ పొట్టుతో మీ తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చుకోవచ్చు..!

ఆలుగడ్డ పొట్టుతో మీ తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చుకోవచ్చు..!

Author:

ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు తెల్లబడటం, సాధారణంగా 50 ఏళ్ళు దాటిన తరువాతే జుట్టు తెల్లబడటం జరుగుతుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 20 ఏళ్ల నుండే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది, 20 ఏళ్లకే జుట్టు తెల్లగా మారుతుండటంతో చాలా మంది మానసికంగా భాదపడిపోతున్నారు, తెల్ల జుట్టుతో బయట తిరగలేక, కెమికల్స్ కలిపిన కలర్స్ తో జుట్టుకి రంగేసుకుంటున్నారు, ఆ కెమికల్స్ వల్ల జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది మరియు ఇతర చర్మ సంభందిత వ్యాదులు వచ్చే అవకాశం ఉంది. కాని ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో ఉండే బంగాళాదుంప తొక్కలతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని చాలామందికి తెలియదు. బంగాళాదుంపలో విటమిన్లతో పాటు ఇనుము, జింక్, రాగి, కాల్షియం, పొటాషియం, నియాసిన్ మరియు మెగ్నీషియంలు ఉంటాయి ఇవి శరీరానికి ఆరోగ్యంతో పాటు జుట్టు నల్లబడడానికి కూడా సహకరిస్తాయి. బంగాళాదుంప తొక్కలతో చేసిన రసంతో జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో క్రింద తెలుసుకోండి.

remove-grey-hair-with-potato-skins-1

బంగాళదుంప తొక్కలతో రసం తయారుచేయు విధానం:
ముందుగుగా ఒక 5 బంగాళదుంపలను కడిగి వాటి పై తొక్కను వేరు చేయాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల మంచి నీరు మరియు ఇంతకుముందు తీసిన తొక్కలు కలిపి ఒక 20 నిమిషాలు ఉడకపెట్టాలి. 20 నిముషాలు ఉడికించిన తర్వాత స్టౌ పైనుండి ఆ గిన్నెను తీసి ఇంకొ 15 నిముషాలు ఆ రసాన్ని చల్లర్చాలి. చల్ల బడిన రసం నుండి జాలి లేదా గుడ్డ సహాయంతో బంగాళదుంప తొక్కలను వేరు చేయాలి. తొక్కలు వేరుచేసిన తర్వాత మిగిలిన రసాన్ని ఒక బాటిల్ లో పోసుకోవాలి. సువాసన కోరకు రోస్మేరి, లావెండర్ ఆయిల్ కలుపుకోవచ్చు.

ఉపయోగించే విధానం:
తెల్లజుట్టు ఉన్నవారు మొదటగా తలస్నానం చేసి తమ జుట్టును ఆరబెట్టుకోవాలి. జుట్టు ఆరిన తరువాత ఒక బ్రష్ లేదా చేతితో తో పైన తయారు చేసుకున్న రసాన్ని జుట్టుకు పెట్టుకోవాలి. అలా జుట్టు మొత్తం ఆ రసాన్ని పెట్టుకున్న తరువాత అది మొత్తం ఆరిపోయెంతా వరకు ఆగాలి. మర్దన చేసుకోవడం, టవల్ తో తుడుచుకోవడం లాంటివి చేయకూడదు. ఒకసారి జుట్టూ ఆరినా తరువాత తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇల వారానికి ఒకసారి నాలుగు వారాలు చేస్తే మీ తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది. డబ్బులు ఖర్చు చేసి కెమికల్స్ వాడటం కన్న ఈ పద్దతితో జుట్టు నల్లబడటంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Also Read: ఇలా చేస్తే వారం రోజుల్లోనే బట్టతలపై జుట్టు పెరుగుతుంది.

(Visited 53,732 times, 1 visits today)