Home / Inspiring Stories / జింజర్ వాటర్ తాగి సులభంగా బరువు తగ్గించేసుకోవచ్చు.

జింజర్ వాటర్ తాగి సులభంగా బరువు తగ్గించేసుకోవచ్చు.

Author:

అసలు నిత్యం మనం చూసే వస్తువులలో, తరచుగా వంటల్లో ఉపయోగించే వస్తువులలోనే అనేక ఔషదాలు దాగి ఉంటాయి. వాటిలో మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియనవి ఎన్నో ఉన్నాయి.

Ginger Water జింజర్ వాటర్‌

నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నయో తెలుసా మీకు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అల్లంలో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే అల్లంలో బరువు తగ్గించే, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? తెలీదా? కానీ నిజ్జంగా అండీ బాబూ అల్లంను ఉపయోగించి తయారు చేసే జింజర్ వాటర్‌ను తాగడం వల్ల కొవ్వు కరుగుతుందట, ఈసీగా స్లిమ్ అయిపోవచ్చట, ముఖ్యంగా పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుందట. అంతేకాదు, దీని వల్ల బరువు కూడా తగ్గుతారట. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న జింజర్ వాటర్ తయారీ ఎలానో తెలుసుకుందామా?

తయారీకి కావల్సిన పదార్థాలు:
అల్లం ముక్క – 1 (మీడియం సైజు కలది)
మంచి నీరు – ఒకటిన్నర లీటరు

తయారు చేసుకునే విధానం:

ముందుగా అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ ముక్కలను నీటిలో వేసి హై హీట్ మీద బాగా మరిగించాలి. ఇలా 10 నిమిషాలు మరిగించాక తక్కువ మంటపై ఉంచి మరో 15 నిమిషాలు నీటిని మరిగించాలి. ఆ తరువాత వచ్చిన మిశ్రమాన్ని బాగా చల్లార్చి వడకట్టాలి. దీనికి అప్పుడు తాగాలి ఇప్పుడు తాగాలి అంటూ నియమాలు ఏమీలేవు రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. అయితే కనీసం 1 లీటరు వరకైనా జింజర్ వాటర్‌ను తాగటం ఖచ్చితంగా మీరు ఊహించనంత మంచి ఫలితాన్నిఇస్తుంది. నిత్యం ఈ వాటర్‌ను తాగుతుంటే కొద్ది రోజుల్లోనే అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. చక్కగా ఎంచక్కా సహజసిద్దంగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా తయరుఅవ్వచ్చు.

Must Read: తుమ్మటం అశుభమా? తుమ్మితే ఏమౌతుంది?

(Visited 32,005 times, 1 visits today)