Home / Entertainment / అఖిల్ కి నచ్చిన ఆ ముద్దుగుమ్మ ఎవరో..?!

అఖిల్ కి నచ్చిన ఆ ముద్దుగుమ్మ ఎవరో..?!

Author:

ఫస్ట్ సినిమాతో బోల్తా కొట్టి చాలా గ్యాప్ తీసుకోని హలో అంటూ మన ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ హలో సినిమాకి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మనసంతా నువ్వే సినిమా స్టోరీనే మళ్ళీ తీసిన కూడా డెస్టినీ అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ సినిమాని యూత్ కి బాగా నచ్చేలా తెరకెక్కించాడు.

Girl-Impressed-Akhil-With-One-Message

ఫస్ట్ సినిమా అయినప్పటికీ తన బ్యూటిఫుల్ లుక్స్ తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఆకట్టుకుంది, అఖిల్ , కళ్యాణి ప్రియదర్శినిల జంట ప్రేక్షకులని యంగ్ ఏజ్ లో ప్రశంసలు దక్కించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. అదే ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మెచ్చుకుందంటే ఆ ఆనందం డబులయిపోతుంది. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ మనసు పులకించిపోతుంది కూడా. అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం ఈ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేక్షకులను బాగానే మెప్పించింది. సినిమా చుసిన ప్రేక్షకులు చాలామంది అఖిల్ కి సినిమా గురుంచి పొగుడుతూ మెసేజ్ లు పెట్టారంటా.. ఆ మెసేజ్ లలో ఒకటి మాత్రం తనకు భలేగా నచ్చేసింది అంటున్నాడు అంటున్నాడు. ‘‘నా మనసు దోచుకున్నావ్’’ అంటూ ఓ అమ్మాయి మెసేజ్ పెట్టిందని.. మిగతా అందరు మెచ్చుకున్న దానికంటే ఈ కామెంట్ మాత్రం తనకు తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చాడు. అంతే కదా యూత్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు పొగుడుతూ పెట్టే మెసేజ్ లే ఎక్కువగా గుర్తుంటాయి మరి..కానీ అఖిల్ ఆ అమ్మాయి ఎవరు అనేది..బయటపెట్టలేదు..!

అఖిల్ తండ్రి.. హీరో నాగార్జున లేడీస్ లో ఫ్యాన్స్ ఎక్కువ. టాలీవుడ్ మన్మథుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్లీ ఈ విషయంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ అమ్మాయిల మనసు కొల్లగొడితే రొమాంటిక్ హీరోగా కెరీర్ లో తిరుగుండదు. ఇంతకీ అఖిల్ ను అంతగా ఇష్టపడిన ఆ చిన్నది ఎవరో.. తరవాతైనా బయటపెడతాడేమో చూడాలి.

(Visited 584 times, 1 visits today)