Home / Entertainment / ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు..ఓ వ్యక్తి అయితే రూ 68లక్షలు చెల్లిస్తానని ముందుకు వచ్చాడు

ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు..ఓ వ్యక్తి అయితే రూ 68లక్షలు చెల్లిస్తానని ముందుకు వచ్చాడు

Author:

ఒక్కోసారి కొందరి ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉంటుందో ఊహకు కూడా అందదు. ప్రియురాలి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వ్యక్తి చేసిన వింత చేష్ట వింటే ఎవరికయినా తలతిరగాల్సిందే.

డేల్ లీక్స్‌, కెల్లీ గ్రీవ్స్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఓ సారి కెల్లీ అతడిని బాగానే కొట్టింది. అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న డేల్‌ ఆమెకు దిమ్మతిరిగిపోయేలా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతడికి ఒక తిక్క ఆలోచన వచ్చింది. ఈ కామర్స్‌ సైట్‌ ‘ఈబే’ లో ఆమెను అమ్ముతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చాడు.

Girlfriend put sale girlfriend on eBay

ఆమె ప్రవర్తన, శారీరక సౌందర్యం గురించి ఆ ప్రకటనలో వర్ణించాడు. ఏదో ఆషామాషీగా పెట్టిన ఆ ప్రకటనకు 24 గంటల్లో విపరీతంగా స్పందన వచ్చింది. దాన్ని 81 వేలమంది చూశారు. చివరకు ఓ వ్యక్తి అయితే రూ. 68లక్షలు చెల్లిస్తానని ముందుకు వచ్చాడు. కెల్లీని డ్రైవ్‌కు తీసుకెళ్తామంటూ అతడి ఫోన్‌కు పెద్ద సంఖ్యలో సందేశాలు వచ్చాయి. అతడు ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది.

(Visited 1 times, 1 visits today)