Home / Inspiring Stories / జీవో 120 అడకత్తెర లో చంద్రబాబు.

జీవో 120 అడకత్తెర లో చంద్రబాబు.

Author:

చంద్రబాబు మొదటి నుంచీ చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారా..? అభివృద్ది జపం చేసే చంద్రబాబు అప్పటికే కొంత అభివృద్ది అయిన ప్రాంతాలను తప్ప వెనుక బడ్డ ప్రాంతాలను పట్టించుకోరూ అన్నది మొదటినుంచీ ఉన్న విమర్శ.ఆయన అభివృద్ది చేయరని కాదు గానీ అయితే ఆ అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. నిన్నతి సమైఖ్య రాష్ట్రాన్ని చూసినప్పుడు అభివృద్ధి అనేది అసమానం గా కనిపిస్తుంది. హైదరాబాద్ విశయం లోనూ, మిగిలిన పట్తణాలను నిర్లక్ష్యం చేసారానీ, దానివల్లే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత సంక్షోబాన్ని ఎదుర్కుంటోందనీ కొందరు విమర్శించటం కనిపిస్తుంది. కనీసం వెనుకబడిన ప్రాంతాలకు చట్టపరంగా, సాక్షాత్తూ రాష్ట్రపతి ఆదేశాల పరంగా లభించే హక్కులను కూడా కాలరాచేలా వివక్షపూరితంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయనేది కొత్త వాదన.ఇప్పూడు జీవో నెం. 120 విషయంలో అదే జరుగుతోందంటున్నారు.

ఐతే ఇది విపక్షాల మాట మాత్రమే కాదు మిత్ర పక్షాలలోని వారు కూడా చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉండగా. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌లో జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా
పరిగణించాలంటూ ప్రభుత్వం కొత్తగా జీవో నెం.120 ని ముందుకు తెచ్చింది. దీనివలన తిరుపతిలోని పద్మావతి మహిళా మెడికల్‌ కళాశాలలో రాయలసీమ కు చెందిన విధ్యార్తులూ, నెల్లూరు జిల్లా విద్యార్థులు 85 శాతం సీట్లు పొందాల్సి ఉండగా ఈ కొత్త జీవో నిబందనల ప్రకారం ఆ ఛాన్సు కోల్పోయారు.మొత్తం రాష్ట్రానికి ఉమ్మడిగా అడ్మిషన్లు జరిగాయి. దీనిపై ఇప్పటికే పలు ఆందోళనలు జరిగాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఈ జీవోను ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.అయితే తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా కూడా వాళ్లని అభివృద్ది నిరోదకులు,టీడీపీ వ్యతిరేకులు గా చూసే చంద్రబాబు సర్కారు ఈ విషయంలో కూడా అలాగే తిమ్మిని బమ్మి చేయాలని చూస్తోంది. అసలు రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ అనవసరం అనీ, వీటిని రద్దు చేయాలనీ గతంలో యనమల రామకృష్ణుడు కూడా ఓ సందర్భంలో సెలవిచ్చారు. అయితే జోనల్ వ్యవస్త లేకపోతే జరిగే అనర్థాలూ ఉన్నయనీ దీని వల్ల వెనుకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర
విధ్యార్థులు, ఆ ప్రాంతాలూ ఇంకా వెనుక బాటుకు లోను అయ్యే ప్రమాదం ఉందనీ అంటున్నారు.

ఈ జీవో 120 పట్ల వ్యతిరేకతను ప్రతిపక్షాల కుట్ర అని ప్రభుత్వం అంటూ వచ్చినా వారి మిత్రపక్షం భాజపా కూడా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడి షాక్ ఇచ్చింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఈ జీవోను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ జీవో వల్ల తిరుపతి మెడికల్‌ కళాశాలలో 127 సీట్లకు గాను 85 శాతం రాయల సీమ, నెల్లూరు వారికి రావాల్సి ఉండగా, కేవలం 12 సీట్లే లభించాయనీ. దీనివల్ల నష్ట పోయిన విధ్యార్థుల పరిస్థితేంటనీ ఆయన ప్రశ్నించారు ఇలాంటి జీవో వలన ముందు ముందు రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఎంతో నష్టం ఖాయమని సామాజిక నిపుణులు చెబుతున్నారు. మరి తమ ప్రభుత్వంలో భాగస్వామి అయిన మిత్రపక్షం కూడా తూలనాడుతోంటే చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందో లేదో చూడాలి మరి.

(Visited 81 times, 1 visits today)