Home / Inspiring Stories / మహిళల జీవితాల్లో వెలుగు నింపిన చైతన్యమూర్తి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే…!

మహిళల జీవితాల్లో వెలుగు నింపిన చైతన్యమూర్తి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే…!

Author:

భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం కాని ఇప్పటికీ కుల, లింగ వివక్ష లాంటి సామజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటి పరిస్తితి కొంచెం నయం కాని 19 వ శతాబ్దానికి ముందు లింగ వివక్ష భయంకరంగా ఉండేది. మహిళలు కేవలం వంటింటికే పరిమితమయ్యేవారు. యుక్తవయసు రాకముందే పెళ్ళి చేయడం, భర్త చనిపొతే సతీసహగమనం, వితంతువులకు గుండు గీయించి సమాజ బహిష్కరణ చేయడం లాంటి ఘోర ఆచారాలు ఉండేవి. వాటి నుండి మహిళల స్వేచ్చ కోరకు పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. ఈవిడ మహాత్మ జ్యోతిరావు పూలే భార్య. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గాంవ్‌లో జన్మించిన సావిత్రిబాయికి, తొమ్మిదేండ్ల వయస్సులోనే జ్యోతిరావుపూలేతో వివాహమయ్యింది. చదువురాని సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే విద్యాబుద్దులు నేర్పారు. చదువుకోవడం వలన కలిగే ఉపయోగాలను గుర్తినిచిన సావిత్రిబాయి 1847 లో భర్తతో కలిసి తక్కువ కులాల బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించి అందరికి చదువు నేర్పించారు.

first-indian-female-teacher

19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో మరియు స్త్రీ హక్కుల పారాటంలో సావిత్రిబాయి పాత్ర మరువలేనిది  ఆధిపత్య వర్గాల చేతుల్లో అణిగిపోతున్న నిమ్న కులాల పక్షపాతిగా అగ్రభాగాన నిలిచి మహిళలను చైతన్యులను చేశారు. వితంతువులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించి వారి కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పరిచారు. వితంతువులకు తిరిగి వివాహాలు జరిపించడం, మరియు కులాంతర, అనాధ పిల్లల వివాహాలు జరిపించి ఇతరులను  ప్రొత్సహించిన మొదటి  మహిళ సావిత్రిబాయి. ఈ క్రమంలో ఎన్నో ఛీత్కారాలను,అవమానాలను ఎదురోడ్డి నిలిచి బడుగు బలహీన వర్గాల వారికి, మహిళల కోసం  మహారాష్ట్రలో 50 విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు.  1897లో పూణేలో ప్లేగు వ్యాధి ప్రభలింది. ప్రజలు ఆ వ్యాధి వచ్చిన వారిని తాకేవారు కాదు దానితో ప్లేగు వ్యాధి బాధితులు చికిత్స చేసేవారు లేక చనిపోయేవారు. దీనిని గమనించిన సావిత్రిబాయి ధైర్యంగా తన దత్త కొడుకు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధి బాధితులకు సేవ చేసి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. కాని చివరికి ఆ వ్యాధే సోకి 1897 మార్చి 10న అమె ఈ భూమిని విడిచి వెళ్ళారు. మహిళల, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి పుట్టిన రోజు సంధర్భంగా ఆ మహనీయురాలిని గుర్తు చేసుకుందాం…!

(Visited 376 times, 1 visits today)