Home / Reviews / గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ & రేటింగ్.

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ & రేటింగ్.

Gautamiputra Satakarni movie review

Alajadi Rating

3.5l5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, కబీర్ బేడీ, శివరాజ్ కుమార్ తదితరులు.

Directed by: క్రిష్

Produced by: రాజీవ్ రెడ్డి.

Banner: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటెర్టైనమెంట్స్.

Music Composed by: చిత్తరంజన్ భట్

నందమూరి బాలకృష్ణ వందో సినిమా “గౌతమిపుత్ర శాతకర్ణి” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది, క్రిష్ లాంటి వైవిధ్యమైన డైరెక్టర్ బాలకృష్ణ వందో చిత్రంగా మనకి తెలియని గొప్ప తెలుగు వీరుడు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కథని ఎంచుకోవడంతో నేషనల్ లెవల్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది, సినిమా పోస్టర్లని, ట్రైలర్లని చూసిన తరువాత సినీ అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి, మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి…!

కథ:

చిన్నతనంలో అమ్మ గౌతమి (హేమ మాలిని) మాత మాటలు వింటూ ముక్కలు ముక్కలుగా ఉన్న అఖండ భారత దేశాన్ని ఒకే రాజ్యంగా ఏకం చేయాలి అనే లక్ష్యాన్ని నిర్ణయంచుకున్నాడు శాతకర్ణి (బాల కృష్ణ), అఖండ భారత ఖండాన్ని ఏకం చేయాలనే కలని సాధించుకునేందుకు అన్ని రాజ్యాలపై యుద్దాన్ని ప్రకటిస్తాడు, ఈ క్రమంలో కొడుకుని  కూడా యుద్ధరంగానికి తీసుకెళ్లడాన్ని శాతకర్ణి భార్య అయిన వశిష్ఠ దేవి (శ్రియ) వ్యతిరేకిస్తుంది, ఈ క్రమంలో శాతకర్ణి భారత రాజ్యాన్ని ఏకం చేశాడా..? సామంత రాజుల సహాయంతో శాతకర్ణి పైకి దండెత్తిన పరాయి దేశస్థులని ఎలా ఎదుర్కొన్నాడు…? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

మనకి తెలియని గొప్ప తెలుగు వీరుడి కథని సినిమాగా తీసాం అని, ప్రతి తెలుగువాడు గర్వించేలా ఈ సినిమా ఉంటుందని ఆడియో వేదికలో క్రిష్ చెప్పటంతో ఈ సినిమాపై అప్పటివరకు ఉన్న అంచనాలు పదింతలు అయ్యాయి, ఆ అంచనాలకి తగ్గట్టుగానే అద్భుతమైన సినిమాని మన ముందుకు తెచ్చారు.

మాములుగా ఎవరి చరిత్ర అయిన చెప్పాలనుకున్నప్పుడు వారి జననం, బాల్యం, వారి గెలుపు గురుంచి చూపిస్తారు, కానీ ఈ సినిమాలో శాతకర్ణి ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్న విషయాన్ని మాత్రమే కథగా తీసుకోని అద్భుతంగా తెరకెక్కించారు, అన్ని రాజ్యాలని ఏకం చేసి ఒక రాజ్యంగా స్థాపించి ఆ రాజ్యంలో అశాంతి అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మన తెలుగువాడి కథని రెండు గంటల సినిమాలో చెప్పటంలో క్రిష్ ఫుల్ సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ ఆఫ్ లో తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలని గెలవడానికి తన కుమారుడినే పణంగా పెట్టి శాతకర్ణి పోరాడిన తీరు అద్భుతంగా ఉంటుంది, ఇంటర్వెల్ కి ముందు బాలకృష్ణ నోటి నుండి వచ్చే డైలాగ్స్ కి ప్రేక్షకులు మైమరిచిపోతారు.

ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ ఆఫ్ కొంచెం నెమ్మదిస్తుంది, శ్రియకి, బాలకృష్ణకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి, శాతకర్ణి రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్న పరాయి దేశస్తులతో శాతకర్ణి సాగించిన పోరాటం సినిమాకే హైలైట్ , సినిమాలో యుద్ధాలే ఎక్కువగా ఉన్నాయి అనే ఫీలింగ్ ప్రేక్షలుకులకి వస్తుంది, కానీ ఆ యుద్దాలు శాతకర్ణి ఎందుకోసం చేశాడు అనేది చెప్పటమే క్రిష్ ప్రధాన ఉద్దేశ్యం, ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిన కాకపోయిన తెలుగు సినిమా చరిత్రలో మాత్రం ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది.

నటీనటుల పనితీరు:

బాలకృష్ణ: ఈ సినిమాలో బాలకృష్ణ నటించినట్లు ఎక్కడ మనకి కనపడదు, నిజంగా శాతకర్ణి యే మన ముందుకి వచ్చినట్లుగా ఉంటుంది, అంతలా ఆపాత్రలో జీవించిపోయాడు.

హేమమాలిని: ఈ సినిమాలో హేమమాలిని చాలా ముఖ్యమైన పాత్రని పోషించింది, గౌతమి మాతగా రాజసాన్ని తన కళ్ళతోనే చూపించింది.

శ్రియ: రాజ్యపు రాణి అంటే ఇలానే ఉండాలేమో అన్నట్లుగా నటించింది శ్రియ, తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది.

ఇంకా విలన్ నటించిన వాళ్ళు, శాతకర్ణి సైన్యంలో ముఖ్య పాత్రలు పోషించిన వాళ్ళు అందరు అద్భుతంగా నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • కథ, స్క్రీన్ ప్లే
  • బాలకృష్ణ
  • డైలాగ్స్
  • కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్:

  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • కొన్ని చోట్ల కథ నెమ్మదించడం.

పంచ్ లైన్: గౌతమిపుత్ర శాతకర్ణి ఇది ప్రతి తెలుగోడు గర్వంగా చెప్పుకోవాల్సిన కథ.

(Visited 2,612 times, 1 visits today)