Home / Entertainment / నందమూరి నటసింహా “గౌతమీపుత్ర శాతకర్ణి” ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

నందమూరి నటసింహా “గౌతమీపుత్ర శాతకర్ణి” ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

Author:

నందమూరి నట సింహం బాలయ్య పుట్టిన రోజుకు ఒక రోజు ముందే నందమూరి అభిమానులకి పండగ మొదలైంది. బాలాయ్య నటిస్తున్న వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజీ్ చేశారు. ఈ పోస్టర్ లో కసిగా ఉన్న గౌతమీపుత్ర శాతకర్ణి రూపంలో బాలయ్య లుక్  అందరిని మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ అంతా యుద్ద సైనికులతో ఎగిరే జెండలతో ఒక హాలీవుడ్ సినిమాని తలపిస్తూ చాలా రిచ్ గా పోస్టర్ ని డిజైన్ చేశారు.

Gautamiputra-Satakarni-First-look

ఈ పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ‘బసవతారకపుత్ర’ బాలకృష్ణ అంటూ తమదైన మార్క్ చూపిస్తూ బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పింది క్రిష్ టీమ్.ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ త్వరలోనే మూడో షెడ్యూళ్లోకి వెళ్లబోతోంది. సినిమా మొరాకాలో  మూడు వారాల పాటు చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు చిత్రికరించారు. తర్వాతి షెడ్యుల్ హైదరాబాద్ లోనే జరుగనున్నాది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Visited 566 times, 1 visits today)