Home / General / ఈ చెట్టు కోసం ఏటా రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం..!

ఈ చెట్టు కోసం ఏటా రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం..!

Author:

మధ్యప్రదేశ్ లోని సల్మత్‌పూర్‌ ప్రాంతంలో ఓ రావి చెట్టు ఉంది, ఆ చెట్టుని కాపాడటానికి ప్రతి నెల లక్ష రూపాయల మేర సంవత్సరానికి రూ.12 లక్షలు ఖర్చు అవుతోందట, ఈ చెట్టుకి అంతప్రత్యేకత ఎందుకంటే.. భారత్‌లోనే ఇది తొలి వీవీఐపీ చెట్టు, ఈ రావి చెట్టుని 2012 వ సంవత్సరంలో శ్రీలంక అధ్యక్షడు మహేంద్ర రాజపక్సే నాటాడు, ఈ చెట్టుని మహేంద్ర రాజపక్సే శ్రీలంక నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ నాటారు, ఈ చెట్టు కోసం ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్ ని కూడా నిర్మించారు. చెట్టుకి ఎటువంటి పురుగులు సోకకుండా మధ్యప్రదేశ్‌లోని అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన బొటానిస్ట్‌ని కూడా ఏర్పాటుచేశారు.

రావి చెట్టు

ఈ చెట్టు చుట్టూ ఒక ఇనుప కంచె వేశారు, ఈ చెట్టుకి కాపలాగా 4 హోంగార్డ్ లని కూడా నియమించారు, వారు వంతుల వారీగా 24 గంటలు చెట్టుకి రక్షణ కల్పిస్తున్నారు, ఈ రావి చెట్టుని సంరక్షించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి నెల దాదాపు లక్ష రూపాయల చొప్పున ఏడాదికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు, ఇంతకీ ఈ చెట్టుకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసా? ఇదే విష‌యాన్ని సాంచిలోని మ‌హాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన భాంటె చంద‌ర‌త‌న్ వివ‌రిస్తున్నారు.

రావి చెట్టు

బుద్ధుడు జ్ఞానోద‌యం పొందిన బోధి చెట్టు కొమ్మ‌ను క్రీస్తుపూర్వం మూడో శ‌తాబ్దంలో ఇండియా నుంచి శ్రీలంక‌కు తీసుకెళ్లి అక్క‌డి అనురాధ‌పుర‌లో నాటారని ఆయ‌న వెల్ల‌డించారు. అదే చెట్టులోని కొమ్మ‌నే ఇక్క‌డ అప్ప‌ట్లో నాటారు. అయితే ఈ చెట్టుకు ఇంత ప్రాధాన్యం ఇస్తుండ‌టంపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ మ‌ధ్యే 51 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో చెట్టు కోసం ఇంత ఖ‌ర్చు, వ‌న‌రుల‌ను వాడ‌టం ఏంట‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చెట్టు సంర‌క్ష‌ణ కోసం ఏటా రూ.12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసే బ‌దులు ఆ మొత్తాన్ని పేద రైతుల కోసం వాడితే బాగుంటుంద‌ని ప‌లువురు హిత‌వు ప‌లుకుతున్నారు.

(Visited 2,230 times, 1 visits today)