Home / Latest Alajadi / కొలువుల జాతర: విద్యుత్ శాఖలో 4 వేల ఉద్యోగాలు..!

కొలువుల జాతర: విద్యుత్ శాఖలో 4 వేల ఉద్యోగాలు..!

Author:

తెలంగాణ విద్యుత్ శాఖ భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడానికి రెడీ అవుతుంది, పెరిగిన విద్యుత్ అవసరాలు, ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలని అన్ని విద్యుత్ శాఖలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోనున్నాయి, ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌ ఇంజనీర్, జూనియర్‌ లైన్‌మెన్‌ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో ఆయా విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో జరగనున్న విద్యుత్‌ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు.

Jenco-Transco-Jobs-Telangana

  • నాలుగు సంస్థల్లో కలిపి అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు – 1000
  • ట్రాన్స్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్ – 330 , సబ్‌ ఇంజనీర్‌ – 174
  • జూనియర్‌ లైన్‌మెన్‌ – 1100
  • జెన్‌కో, TSSCDCL, TSNPDCL సంస్థలలో – 2500 ( ఈ సంస్థల విషయంలో ఇంకా పూర్తి సమాచారం రాలేదు )
(Visited 556 times, 1 visits today)