Home / General / నిజాయితీకి 25 సార్లు బదిలీ వేటుతో సత్కారం.

నిజాయితీకి 25 సార్లు బదిలీ వేటుతో సత్కారం.

Author:

నిజాయితీగా పనిచేస్తూ, న్యాయాన్ని గెలిపించడానికి నిరంతరం కష్టపడుతున్న ఆమెకి ప్రభుత్వం ఇప్పటికి 25 సార్లు బదిలీ వేటు రూపంలో సత్కారాలు అందజేసింది, తన 16 ఏళ్ళ సర్వీస్ లో 25 సార్లు బదిలీ వేటుకి గురైన ఆ బదిలీలని శిక్షగా కాకుండా కొత్త బాధ్యతగా స్వీకరిస్తుంది ఐపీఎస్ రూప మౌద్గిల్, కొన్ని రోజుల క్రితం పరప్పన అగ్రహారం జైలులో చిన్నమ్మ శశికళకు జైలు అధికారులు అక్రమంగా కల్పిస్తున్న సౌకర్యాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన రూప మౌద్గిల్ ని బదిలీ వేటుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది, ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల్ని నిజాయతీతో నిర్వహిస్తానని, ఈ బదిలీతో తాను నిరాశకు గురి కాలేదని తనను కలుసుకున్న విలేకరులకు ఆమె తెలిపారు, బాధ్యత ఏదైనా నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిజాయితీగా వ్యవహరించటం ఆమె తత్వం అందుకే ఇప్పటికే 25 సార్లు బదిలీ వేటుతో ప్రభుత్వం నుండి సత్కారాలు అందుకున్నారు.

రూప మౌద్గిల్

పరప్పన కారాగారంలో జరుగుతున్న అవకతవకలని రూప మౌద్గిల్ బయట పెట్టడం వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడింది, ఈ విషయం రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకి ఒక అస్త్రం దొరికింది, చిన్నమ్మకి జైలులో 5 ప్రత్యేక గదులు కేటాయించడం, ప్రత్యేక వంటగదితో పాటు సకల సౌకర్యాలు ఉన్న విషయాలని బహిర్గత పరచడంలో ఐపీఎస్ రూప మౌద్గిల్ కి సహకరించిన ఖైదీలని కూడా అధికారులు వేరే జైలుకి తరలించారు.

జైలులో జరుగుతున్న అక్రమాలని బయటపెట్టిన ఐపీఎస్ అధికారిణిపై బదిలీ వేటు వేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం పై తమ వ్యతిరేకతని వ్యక్తపరుస్తున్నారు, ఇలా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం సమంజసం కాదు.

(Visited 1,731 times, 1 visits today)