Home / Videos / Video: తన పెళ్లి వూరేగింపులోనే డ్యాన్స్ చేస్తూ చనిపోయిన పెళ్ళికొడుకు.

Video: తన పెళ్లి వూరేగింపులోనే డ్యాన్స్ చేస్తూ చనిపోయిన పెళ్ళికొడుకు.

Author:

పెళ్ళి వూరేగింపులలో చేసే నృత్యాల గురించి అందరికి తెలిసిందే కాని ఆ నృత్యమే పెళ్ళి రోజే  పెళ్ళికొడుకు ప్రాణాలు తీసింది. గుజరాత్ లోని రనోలి గ్రామానికి చెందిన 25 యేళ్ళ సాగర్ సోలంకి కి బొర్సద్ గ్రామానికి చెందిన యువతితో మంగళవారం వివాహం జరిగింది. పెళ్ళి జరిగిన తరువాత తమ గ్రామానికి తిరుగు ప్రయాణానికి ముందు బొర్సద్ లో పెళ్ళివారందరూ నృత్యాలు చేసుకుంటూ వూరేగింపు నిర్వహించారు. అందులో పెళ్ళికొడుకు స్నేహితులు అతడిని భుజాలపై ఎత్తుకొని డ్యాన్సులు చేసారు. పెళ్ళికొడుకు కూడా కొంత సేపు ఉత్సాహంగానే నృత్యం చేసి ఒక్కసారిగా స్నేహితుడి భుజాలపైనే కుప్పకూలాడు. అతన్ని క్రిందికి దింపి చూసే లోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడీయోను క్రింద చూడండి.

ఈ సంఘటణతో అందరిలోనూ విషాదం నిండుకుంది. ఆసుపత్రిలో సాగర్ మృతదేహాన్ని పరీక్షించిన డాక్టర్ హార్ట్ అటాక్ వలన అతడు మరణించాడని ధృవీకరించారు. తమ అబ్బాయికి చాల ఆరోగ్యంగా ఉంటాడని ఇలా ఎందుకు జరిగిందో తమకు తెలియదని తెలిపారు సాగర్ తండ్రి రాజేష్ సోలంకి. ఊహించని ఈ పరిణామం ఆ గ్రామాలలో అందరిని కలిచి వేసింది.

(Visited 5,301 times, 1 visits today)