Home / General / గిన్నిస్ రికార్డు: ఓ రింగ్ లో 6 వేల 690 వజ్రాలను పొందుపరిచారు

గిన్నిస్ రికార్డు: ఓ రింగ్ లో 6 వేల 690 వజ్రాలను పొందుపరిచారు

Author:

వజ్రపు ఉంగరంలో ఒకటి లేదంటే రెండు వజ్రాలు ఉంటాయి. అయితే ఓ రింగ్ లో మాత్రం  6 వేల 690 వజ్రాలను పొందుపరిచారు. 18 క్యారెట్ల ఉంగరంలో అన్ని వజ్రాలను కూర్చారు.  గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కింది. విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు.

గిన్నిస్‌ బుక్‌ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్‌ చేశారు. ఈ లోటస్‌ డైమండ్‌ రింగ్‌ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్‌ను రూపొందిచమన్నారు ఉంగరం తయారీ దారులు. ఈ లోటస్‌ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(Visited 1 times, 1 visits today)