Home / health / గో మూత్రంలో బంగారం..! పరిశోధనలో బయటపడ్డ సంచనలం.

గో మూత్రంలో బంగారం..! పరిశోధనలో బయటపడ్డ సంచనలం.

Author:

మన దేశంలో గోవుల్ని హిందువులు దైవంతో సమానంగా పూజిస్తారు, మిగతా జంతువుల కంటే గోవుని ఎక్కువగా ఆరాధిస్తారు, గోమాతని పూజిస్తే చేసిన పాపాలు హరిస్తాయన్నది వారి నమ్మకం, గోమూత్రం ని పవిత్రంగా భావిస్తారు, చాలా మంది ప్రతి రోజు గోమూత్రాన్ని సేవిస్తారు కూడా, ఇప్పటి వరకు గోమూత్రంలో ఔషధ గుణాలు మాత్రమే ఉంటాయని, గోమూత్రాన్ని వివిధ వ్యాధుల చికిత్సకి వాడుతారని మాత్రమే మనకి తెలుసు, కాని ఇప్పుడు గుజరాత్ కి చెందిన పరిశోధకులు చేసిన ప్రయోగంలో సరికొత్త నిజాలు తెలిసాయి.

Gold-in-cow-urine1

Must Read: మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు…!

గుజరాత్ లో ఉన్న జేఏయూ(జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటి) కి చెందిన పరిశోధకుడు డాక్టర్ బి.ఏ గొలాకియా చేసిన ప్రయోగంలో గోమూత్రంలో ఔషధ గుణాలతో పాటు బంగారం కూడా ఉంటుందని తేలింది, గిర్ జాతికి చెందిన 400 ఆవుల మూత్రాలను సేకరించి ఈ ప్రయోగాన్ని చేపట్టారు, గోవుల నుంచి లీటర్ మూత్రాన్ని సేకరించి పరిశీలించగా మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్లు పరిశోధనలో తేలింది, ఈ బంగారం అయాన్ల రూపంలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం ‘గ్యాస్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ’(జీసీ-ఎంఎస్) పద్ధతిని వినియోగించి విశ్లేషించామని మీడియాకు వెల్లడించారు.అంతేకాదు ఇతను ఒక్క గోవు మూత్రంతోనే కాకుండా ఒంటెలు,గేదెలు, మేకల నుంచి మూత్రం సేకరించి ప్రయోగం చేశాడు. అయితే వాటిలో యాంటి బయోటిక్ పదార్థాలు కనిపించలేదు ఆఖరిగా గో మూత్రంలో బంగారం ఉందని తేల్చి చెప్పాడు.

gujarat-scientists-finds-gold-in-cow-urine

గోమూత్రంలో బంగారం ఉంటుందని మన పూర్వీకులు చెబుతుండేవారు,ఆ మాటలని సీరియస్‌‌గా తీసుకొని చేసిన ప్రయోగంతో మన పూర్వీకులు చెప్పిన మాటలు శాస్త్రీయంగా నిజమయ్యాయి.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

Source: Times Of India

(Visited 6,205 times, 1 visits today)