ఎప్పుడెప్పుడా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూసిన ప్రభాస్ ‘బాహుబలి’,మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ రిలీజయ్యి మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు గుణశేఖర్ ‘రుద్రమదేవి’పై పడింది. దాదాపు 70కోట్లతో నిర్మించిన ఈ చారిత్రాత్మక సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే పరిమితమైన చారిత్రక కథాంశం. అయితే భారీ సాంకేతిక పరిజ్ఞానం,పైగా 3డీ సినిమా కావడంతో కొందరు మాత్రం ఈ చిత్రాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టోరీ అయినప్పటికీ గుణశేఖర్ మాత్రం దీనిని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంపై ఎక్కువశాతం మంది పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో ఆయన రుటు మార్చాడు. త్వరలో తాను మహేష్‌బాబుతో ‘ప్రతాపరుద్రుడు’ చేస్తానంటు రుద్రమదేవికి హైప్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని, మహేష్ పేరు చెప్పి ప్రస్తుతానికి ‘రుద్రమదేవి’ని గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతోనే గుణశేఖర్ ఇలాంటి విషయాలను లీక్ చేస్తున్నాడని, మహేష్ సినిమా అంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. మొదట ‘బ్రహ్మూెత్సవం’ చేయాలి. తర్వాత త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత పూరీజగన్నాథ్, మురుగదాస్, రాజమౌళి, వినాయక్, మళ్ళీ కొరటాల వంటి డైరెక్తర్స్ వెయిటింగ్‌లో ఉండటం చూస్తే గుణశేఖర్‌ది కేవలం పబ్లిసిటీ గిమ్మికే అనొచ్చు.