Home / Entertainment / గుట్టు విప్పిన రాజమౌళి…!

గుట్టు విప్పిన రాజమౌళి…!

Author:

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? ఇది దాదాపు భారత దేశమంతా ఇప్పుడు హల్ చల్ చేస్తున్న ప్రశ్న.దేశవ్యాప్త సంచలనమై న్విజువల్ అద్బుతంగా నిలబడిన బాహుబకి ఇప్పటికే  నిర్మాతల పై కనక వర్షం కురిపిస్తోంది.ఐతే ఈ సినిమా కి సీక్వెల్ కూడా రానుందనే సంగతి తెలిసిందే వచ్చే ఈ బాహుబలి-2 కి కీలకమైన పాయిట్ గా నిలిచిన అంశం కట్టప్ప బాహు బలిని ఎందుకు చంపాడూ? అనేదే.
ఈ ప్రశ పై ఎన్నొ స్పూఫ్ లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పేశాడు. ఐతే ఆయన జవాబు చెప్పింది కామన్ ఆడియన్స్ కి కాదు. తన యూనిట్ సభ్యులకి నెల రోజులుగా బాహుబలి-2 స్క్రిప్టుకు మెరుగులు దిద్దిన రాజమౌళి  ఎప్పట్లాగే తన టెక్నికల్ టీమ్ తో సిట్టింగ్ వేసి.చేయబోయే కథని  వాళ్లకు కథను నరేట్ చేశాడు. కథారచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎస్.కార్తికేయ  తమిళ రచయిత మదన్ కార్కితో పాటు బాహుబలి టెక్నికల్ టీమ్ అంతా ఈ సిట్టింగ్ లో పాల్గొంది. ఇప్పూదు కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకుంటూండటం తో వారికి తగ్గట్టు గా కొన్ని సీన్లను కూడా మళ్ళీ తిరిగిరాస్తున్నారట. రాజమౌళి డైరెక్టర్ సీట్
లో కూర్చుని అందరికీ కథ నరేట్ చేస్తున్న దృశ్యాన్ని నిర్మాత శోభు ట్విట్టర్లో పెట్టాడు. రాజమౌళి బాహుబలి తొలి భాగం తీసేటపుడు కూడా ఇలాగే తన యూనిట్ సభ్యులందరికీ కథ నరేట్ చేసి అందరితో రిహార్సల్స్ కూడా చేయించాడు. ఐతే ముందుగా టెక్నికల్ టీమ్కు స్తోరీ ముందుగా చెప్పేసారు. ఆ తర్వాత నటీనటలకు వేరే సెషన్ ఉంటుంది. బాహుబలి-2 కథ కూడా ఇంతకుముందే రెడీ అయింది 40 శాతం షూటింగ్
కూడా పూర్తయింది. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూశాక రెండో భాగంపై భారీ అంచనాల్ని అందుకునేందుకు మరింతగా కష్టపడింది రాజమౌళి బృందం. దాదాపు నెల రోజుల నుంచి రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ తో పాటు వీరి కుటుంబ సభ్యులు అసిస్టెంట్లు కూర్చుని మరింత పకడ్బందీగా స్క్రిప్టు తయారు చేశారు. ఇప్పుడు మారిన కథతో బాహుబలి మరింత బలంగా తయారయ్యాడని సమాచారం…

(Visited 42 times, 1 visits today)