టాలివుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఫుల్ హాపీగా ఉన్నాడంట. ఈన్నేళ్ళ బర్త్ డేల్లో ఇదే గొప్పదని ఫీలవుతున్నాడట. ఎందుకో తెలుసా. మీకిప్పటికే అర్థమయిందనుకుంటా..యస్..ఈ బర్త్ డే కి అక్కినేని ఫామిలీ మనకు ట్రిపుల్ బొనంజా ఇస్తోంది. ఒక వైపు నాగ్ కొత్త సినిమా సొగ్గాడే చిన్ని నాయన, ఇంకో వైపు నాగ చైతన్య గౌతం మీనన్ ల సాహసం శ్వాసగా సాగిపో సోదరా, మరో వైపు అందరూ ఎదురు చూస్తున్న అఖిల్ వి వి వినాయక్ ల అఖిల్ సినిమాల ఫస్ట్ లుక్కులు, టీజర్లతో నాగార్జున బర్త్ డే స్పెషల్ గా నిలిచిపోనుంది. అందుకే నాగ్ తెగ హాపీ గా ఫీలవుతున్నాడట. కొడుకులతో పాటూ పోటీ పడుతూనే వాళ్ళకూ కాంపిటిషన్ ఇస్తూ వాళ్ళ కన్నా అందగాడు అనిపించుకుంటున్న మన మన్మథుడికి ఇది నిజంగా స్పెషల్ బర్త్ డే నే. చిన్న కొడుకుని మాస్ హీరోగా లాంచ్ చేయడానికి నాగ్ చేసిన, చేస్తున్న ప్లాన్ చూస్తే ఒక సూపర్ ఫాదర్ కనబడుతాడు. అలాగే చైతు కెరీర్ ని గాడిలో పెడుతున్న విధానం చూసిన నాగార్జునని తండ్రి గా పొందడం ఎంత లక్కీయో తెలుస్తుంది. అందుకే చైతు, అఖిల్ లు ఈ బర్త్ డే ఎంతొ ఎక్సైటింగ్ గా ఉందని ట్వీట్ చేసారు. నాగ్ కూడా ఏం తక్కువ తినలెదు. నా బర్త్ డే కి ఇంతకన్నా స్పెషల్ గిఫ్ట్ ఏముంటుందని తెగా అనందపడుతూన్నాడంట. మొత్తానికీ ముగ్గురూ మూడూ విభిన్నమైన సినిమాలు చేస్తుండడం కూడా గమ్మత్తే. నాగ్ సొగ్గాడే చిన్ని నాయన ఫామిలీ సినిమా అయితే, చైతు చేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సోదరా రొమాంటిక్ రోడ్ త్రిల్లర్. ఇక కాబోయే సూపర్ స్టార్ గా అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్న అఖిల్ సినిమా అఖిల్ ఏమో పక్క మాస్ ఎంటర్ టైనర్.. పైగా సొషియో ఫాంటసి కూడా అంటున్నారు. చుడాలి మరి ఈ మనం ఫామిలీ ఎలాంటి హిట్స్ కొట్టబోతున్నారో? ఏది ఏమైనా ఫాన్స్ కి మాత్రం ఇది నిజంగా ట్రిపుల్ బొనంజా.. ఈ సందర్భంగా అలజడి నాగ్ కి బర్త్ డే విషెస్ చెబుతోంది. వి విష్ ఎ వెరీ హాపీ బర్త్ డే టు టాలివుడ్ మనమథుడు.
(Visited 142 times, 1 visits today)