Home / Entertainment / హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

Author:

ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలే తెలుగు సినిమా, తెలుగు సినిమాయే ఈ మూడు అక్షరాలు, నందమూరి తారక రామారావు… ఈ పేరు వినగానే తెలుగువాడి గుండె ఆత్మగౌరవంతో ఉప్పొంగుతుంది, తెలుగు ఆడియన్స్ హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతాయి , అటువంటి మహనీయుడి పేరుతో పాటు రూపాన్నీ పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనుమడిగా పేరు తెచ్చుకున్నారు.తాత ఎన్టీఆర్ ని , బాబాయ్ యువరత్న బాలకృష్ణ ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన మార్క్ తెలుగువారి హృదయాల్లో వేసారు.

BalaRamayanamMovie

ఎంట్రీ ఇచ్చిన రెండవ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి, ఆ తరువాత వరుస విజయాలతో జోరు పెంచి రాజమౌళి డైరక్షన్లో సింహాద్రి అంటూ ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరువై అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్లు అన్నీ తిరగ రాసాడు.

NTR 1

చూడటానికి బుడ్డోడు లానే కనిపిస్తాడు కానీ ఎంట్రీ ఇచ్చాడంటే అమ్మతోడు రికార్డులని అడ్డంగా నరికేస్తాడు. డాన్స్లో అయినా, డైలాగ్ డెలివరీ లో అయినా సింగల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు, అందుకే వివి వినాయక్, కృష్ణ వంశీ, రాజమౌళి వంటి అగ్ర దర్శకులు జూనియర్ ని పరిపూర్ణ నటుడనీ. అతడి నుంచి ఎలాంటి అవుట్ పుట్ ని అయినా ఈజీ గా తీసుకోవచ్చనీ చెప్తారు. ముఖ్యంగా అతనికి బాష మీద ఉన్న పట్టు, కమాండ్ ఓవర్ ది డైలాగ్, ఒక డైలాగ్ ని ఎక్కడ ఒత్తాలో ఎక్కడ ఎత్తాలో ఈ హీరో కి తెలినట్టుగా ప్రస్తుతం ఉన్న ఏ హీరోకి తెలియదు, అందుకే అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ లో విషయం ఉన్న డైరెక్టర్లు ఎన్టీఆర్ అంటే పడి చస్తారు .

NTR-Nannaku-Prematho

మాటల్లో పవర్ ఉంది , చేష్టల్లో ఎనర్జీ ఉంది , డాన్సు లో ఊపు ఉంది నటనలో పదును ఉంది టోటల్ గా ఎన్టీఆర్ అంటే పర్ఫెక్ట్ స్టార్, ఎన్టీఆర్ ఎలాంటి కారెక్టర్ అయినా అధ్బుతం గా చేయగల హీరో ..ఆది ,సింహాద్రి తో మాస్ హీరో గా..బృందావనం తో ఫామిలీ హీరో గా,అదుర్స్ తో కామెడీ పండించగల హీరోగా ,రాఖి తో ఎమోషనల్ హీరో గా,యమదొంగ తో ఎలాంటి సినిమా అయినా చేయగల హీరో గా నిరువుపించుకున్నాడు, ఇక నిన్నమొన్న వచ్చిన టెంపర్ సినిమాతో నెగటివ్ షేడ్ ఉన్న కారెక్టర్ కూడా ఇరగదీయగలడని చూపించేసాడు …ఎన్టీఆర్ స్టామినా కి కరెక్ట్ సినిమా పడితే డౌట్ లేకుండా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టగల హీరో ..ఎప్పుడున్న యంగ్ హీరోలలో ఏ కారెక్టర్ ఎలా చేయాలో అందరి కంటే ఎన్టీఆర్ కే బాగా తెలుసు.

NTR-Nannaku-Prematho

ఇది ఇలా ఉండగా బాబాయి తో ఈ మధ్య మనస్పర్ధలు పెంచుకుని అంటీ, అంటనట్టు ఉండటం ఎన్టీఆర్ కి కాస్త మైనస్ గానే మారింది, అదే బాబాయి తో కలిసి ఉంటే ఎన్టీఆర్ కలక్షన్ల స్థాయి ఇంకో మెట్టు పైననే ఉండేది, ఆయన ఎలాగూ లెజెండ్ కాబట్టి, జూనియరే బుజ్జగించో, బ్రతిమాలో మళ్ళీ బాబాయ్ పంచకి చేరితే బాగుంటుంది.

Janatha Garage First Look జనతా గ్యారేజ్' సినిమా ఫస్ట్ లుక్

సినిమా, సినిమాకీ ఎదుగుతూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రస్తుతం 33వ ఏట అడుగుపెడుతున్నాడు.మరి ఈ ఇయర్ అయినా బాబాయ్ తో మనస్పర్ధలు క్లియర్ చేసుకుని బహిరంగంగా ఓ సారీ చెప్తే బాగుండు అని చాలా మంది నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు, చాలా రోజుల తర్వాత మంచి మాస్ లుక్ తో కనబడుతున్నాడు, మరి కొత్త సినిమా కి అల్ ది బెస్ట్ చెప్తూ ఈ యంగ్ టైగర్ కి బర్త్ డే విషెస్ చెప్దామా …. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్.

(Visited 596 times, 1 visits today)