Home / Entertainment / రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్..!?

రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్..!?

Author:

Pawan Kalyan and Harish Shanker Gabbar Singh 2

హరీష్ శంకర్ కి పవన్ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడా ? దాదాపు అవును అనే మాటలే వినిపిస్తున్నాయ్. హరీష్ గురించి మాట్లాడుకుంటే మొదటి నుండీ కెరీర్ ఒక ఫ్లాప్, ఒక హిట్ ఇలా సాగుతూ ఉంది. రవితేజ తో షాక్ అనే ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత కొంత గ్యాప్ తో మళ్ళీ అదే హీరోతో మిరపకాయ్ అంటూ సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా గబ్బర్ సింగ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మళ్ళీ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్యా వస్తావయ్య అంటూ ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. చివరికి సాయిధరమ్ తేజ్ తో కూడా ఓ సినిమా చేసాడు, గబ్బర్ సింగ్ సీక్వెల్ కూడా మరో డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పట్లో మనోడు బన్నీతో ఒక సినిమా చేస్తాడని.. ఆ తరువాత సొంతంగా ఓ రెండు చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడని టాక్ వచ్చింది కాని.. వాటిలో ఏదీ నోచుకోలేదు. ఇకపోతే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. మనోడు పవన్ కళ్యాణ్ ను డైరక్టు చేయబోతున్నాడట.

ఆల్రెడీ గబ్బర్ సింగ్ తీసి పవన్ కెరీర్ కి ఊపు తెప్పించి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈసీ గానే ఒప్పెసుకుంటాడు కానీ, హరీష్ తెలివిగా కథను ఏ.ఎమ్.రత్నంకు చెప్పాడట. ఆయన వెంటనే పవన్ కు ఫోన్ చేసిఈ కథ చాలా బాగుంది మీరు కూడా వినండి అని చెప్పాడట. ఆ కథ పవన్ కి తెగ నచ్చేయటంతో పవన్ కూడా ఓకె చెప్పాడు అని సన్నిహితులు చెబుతున్నారు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చివరలో రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ వేసారు, హరీష్ శంకర్ చెప్పిన కథ రాజా సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ కి సంభందించినదే అని పవన్ సన్నిహితులు అంటున్నారు, ఇదే కనుక నిజం అయితే ఫ్యాన్స్ కి పండగే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే మరి.

Must Read: బ్రహ్మోత్సవం లో మహేష్ బాబు డాన్స్ చూస్తే మతులు పోతాయి.

(Visited 1,291 times, 1 visits today)