Home / Inspiring Stories / ప్రభుత్వ ఉద్యోగం మానేసి…వ్యవసాయంలో కోట్లు సంపాదిస్తున్న యువకుడు.

ప్రభుత్వ ఉద్యోగం మానేసి…వ్యవసాయంలో కోట్లు సంపాదిస్తున్న యువకుడు.

Author:

కృషి, పట్టుదల, బలమైన కోరిక ఉంటే మనం ఏదైనా సాధించగలం అని పూర్వ కాలం మన పెద్దలు చెబుతున్న మాట, ఈ మాటలని స్ఫూర్తిగా తీసుకోని గొప్ప గొప్ప విజయాలని సాధించినవారు చాలామందే ఉన్నారు, అలాంటి వ్యక్తుల్లో ఒకరు హరీష్ ధండేవ్, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతానికి చెందిన హరీష్ మున్సిపల్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులకి ఉద్యోగం నచ్చక రాజీనామా చేసి ఇంటికి వచ్చాడు, ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసావు, ఇప్పుడు ఏం చేస్తావ్.? అని అడిగిన తండ్రికి వ్యవసాయం చేస్తా అని హరీష్ సమాధానమిచ్చాడు, మన ప్రాంతంలో వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి, మన దగ్గర ఉన్నది ఇసుక నేలలు..వాటిలో ఏ పంటలు సరిగ్గా పండవు అంటూ తిట్టి వెళ్లిపోయాడు తండ్రి…. హరీష్ కుటుంబానికి థార్ ఎడారి చుట్టు పక్కల దాదాపు 90 ఎకరాలు ఉంది. అవన్నీ పూర్తిగా ఇసుక నేలలే.

అలోవెరా

తమకున్న భూమిలో మాములు పంటలు పండవు అని తెలుసుకున్న హరీష్ ఆ ప్రాంతంలో ఉన్న భూములలో ఎలాంటి పంటలు పండుతాయో కొంత పరిశోధన చేసి, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతో తనకున్న 90 ఎకరాల భూమిలో అలోవెరా (కలబంద) మొక్కలని నాటాడు, అలోవెరా మొక్కలు ఎడారి ప్రాంతాలలో త్వరగా పెరుగుతాయి, అలోవెరా మొక్కలని ఔషధాల తయారీలో, బ్యూటీ ప్రొడక్ట్స్ , ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారీలలో విరివిగా ఉపయోగించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కలబంద మొక్కలకి డిమాండ్ ఉండటంతో హరీష్ వ్యవసాయం మొదలుపెట్టిన కొద్దీ రోజులకే లాభాలు సాధించాడు.

అలోవెరా

అలోవెరా మొక్కలను కొనడానికి పతంజలి ఫుడ్‌ ప్రొడక్జ్‌ లిమిటెడ్‌ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు హరీష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలోవెరా మొక్కల సాగు ద్వారా హరీష్ ఏడాదికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. అంతే కాదు తన 90 ఎకరాల్లో 200 కు పైగా జనాలకు ఉపాధిని కూడా ఇస్తున్నాడు..తిట్టిన తండ్రే కొడుకు తెలివితేటలకు సంబరపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, దండగ అన్న వ్యవసాయాన్ని పండగగా మార్చి 200 మందికి ఉపాధి కల్పిస్తున్న హరీష్ ను అభినందిద్దాం.

(Visited 4,211 times, 1 visits today)