Home / health / అమ్మతనాన్ని అబార్షన్ తో ముగించుకోవద్దు.

అమ్మతనాన్ని అబార్షన్ తో ముగించుకోవద్దు.

Author:

ఆడతనానికి పరిపూర్ణం అమ్మ అయినప్పుడే వస్తుంది అంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అని ఆత్రేయ అన్నట్టు ప్రపంచంలో కల్తి లేనిదంటు అమ్మ ప్రేమ ఒక్కటే. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదు. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు అంటారు పెద్దలు కానీ ఇప్పుడు అంత ఫాస్ట్ యుగం కద! పెళ్ళి కాకుండనే అనుకోని కారణాల వల్ల గర్బవతి అవుతున్నారు. ప్రేమించిన వాడు మోసం చేయడమో లేదా చిన్న వయసులోనే తల్లి కావడం ఇష్టం లేకపోవడం వల్ల  అబార్షన్ చేయించుకునేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

he-performed-1200-abortions-in-new-viral-video-he-wants-you-to-see-what-abortion-really-looks-like

గర్బంలోని పిండం 3 నెలలు దాటితే అబార్షన్ చేయడం రిస్క్ అంటున్నారు డాక్టర్స్, ఎందుకంటే 3 నెలలు దాటితే పిండం పెరగటం మొదలవుతుంది కావున ఆ సమయంలో అబార్షన్ చాలా ప్రమాదం అంటున్నారు గైనకాలజిస్టులు. అయినప్పటికి కొంత మంది 3 నెలలు దాటిన అంటే 4-5 నెలల మధ్యలో కూడా అబార్షన్ చేయించుకుంటారట! ఆ సమయంలో తల్లి ప్రాణాలకి చాలా ప్రమాదం అంటున్నారు డాక్టర్స్. 3 నెలల తర్వాత అబార్షన్ చేయించుకుంటే రానున్న రోజుల్లో అనేక సమస్యలకు గురి అవుతారట!. అలాగే గర్భాశయ ఇన్‌ఫెక్షన్, హెమరేజ్, గర్భధారణ సమస్యలతోపాటు ఒక్కోసారి మళ్లీ గర్బం వచ్చే అవకాశాన్ని కొల్పోతుంటారట! కొన్ని క్లిష్ట పరిస్థితులలో మృతి కూడా చెందేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.

  • ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అయిన ఆంథోని లెవాటినో 5 నెలలు దాటిన శిశువు కడుపులో ఉండగా అబార్షన్ ఎలా చేస్తారో చూపిస్తూ ఒక ఓ యానిమేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఈ డాక్టర్ ఇప్పటి వరకు దాదాపు 1200 అబార్షన్లు చేశారట!
  • ముందుగా డాక్టర్ అబర్షన్ చేసే సమయంలో ముందుగా ఓ సోఫర్ క్లాంప్‌ను యోని ముఖ ద్వారం వద్ద ఉంచి గర్భాశయంలోకి సులభంగా వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తాడు.
  • అలాగే ఈ యోని మార్గం ద్వారా ఓ క్లాంప్‌ను గార్బశంలోకి పంపి ముందుగా కాళ్ళను కత్తిరించి తర్వాత శరీర భాగాలలో ఒక్కొక్కటి కత్తిరిస్తారు.

ఈ విధంగా అమెరికలో చాలా మంది 4వ నెల తర్వాత అబార్షన్‌లను నిలిపివేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. అలాగే లివ్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరి కొన్ని సంస్థలు కలసి మొత్తం అమెరికాలో అబర్షన్ లను చేయడం పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయట!

చూసారా పుట్టే పసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయాడం మనం యానిమెషన్లో చూస్తేనే మన మనసు అదోలా ఉంది కాబట్టి మనం కూడా ఇలాంటి అబార్షన్స్ జరగకుండ చూద్దాం.

Must Read: స్మార్ట్ ఫోన్ పోయిందా..? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సహాయంతో సులభంగా కనిపెట్టవచ్చు.

(Visited 14,234 times, 1 visits today)