Home / health / బీర కాయ తో షుగర్ వ్యాధికి బై బై!!!

బీర కాయ తో షుగర్ వ్యాధికి బై బై!!!

Author:

మాములుగా ఐతే బీర కాయ తినాలంటే మహా బోరు గా ఫీల్ అవుతారు చాలా మంది. కానీ బీర కాయ మన శరీరానికి చాలా మంచిది అంటున్నారు డాక్టర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆహరం లో బీర కాయ మస్టుగా ఉండాల్సిందే అని సలహా ఇస్తున్నారు . బీర కాయలో సహజంగా ఉండే పీచు పదార్థము వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఇది సులువుగా జీర్ణం అవుతుంది. తద్వారా మలబద్దకం, జీర్ణ సమస్యలు మాయమవుతాయి. బీర లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల మలబద్దకమే కాకుండా పైల్స్ ఉన్నవారికి దివ్యౌషధం లాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్ధం రక్తాన్ని శుభ్ర పరిచి కంటి చూపును మెరుగు పరుస్తుంది, అంతే కాక ఇది లివర్ , గుండె పనితీరుని మెరుగు పరచడంలో కూడా సహజ సిద్ధంగా ఉపయోగపడుతుంది.

weight loss with ridge gourd

బీర కాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గుదాం అనుకునే వాళ్లకు ఇది చక్కటి ఆహరం. ఆకలి తీరుస్తూనే బరువు తగ్గించడం లో బీరని మించింది లేదు అంటున్నారు డాక్టర్లు. ఇక రోజూ ఒక గ్లాసు బీర జ్యూస్ తాగితే కామెర్ల వ్యాధి కూడా సహజంగానే తగ్గుతుంది. ఇంకా అందరికన్నా షుగర్ వ్యాధి గ్రస్తులకితె ఇది అద్భుతంగా పని చేస్తుందట. బీర కూర రూపంలో అయినా, పచ్చడి లా అయినా, జ్యూస్ లాగా తాగినా షుగర్ వ్యాధికి చెక్ పెట్టేస్తుందట. ఇన్ని రకాల వ్యాధులకు ఒక్క బీర కాయతోనే చెక్ పెట్టగలిగినప్పుడు ఎవరు మాత్రం బీర కాయని తినము అంటారు చెప్పండి. పైగా ఈ వర్షాకాలం లో విరివిగా దొరుకుతుంది ఈ సర్వ రోగ నివారిణి బీర కాయ. ఇంకెందుకు ఆలస్యం బీర కాయ కూర ఈరోజే వండేసుకోండి.

(Visited 943 times, 1 visits today)