Home / Latest Alajadi / హెచ్చరిక : హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి…

హెచ్చరిక : హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి…

Author:

తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నుంచి ఎడతరిపి లేకుండా కురుస్తోన్న విషయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. బేగం బజార్ పాత పీఎస్ పరిసరాల్లో 3 అడుగుల మేర చేరిన వర్షపు నీరు చేరింది. అఫ్జల్‌గంజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ వద్ద 2 కిలోమిటర్ల మేర వాహనాలు నిలిచాయి.

నగరంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.

నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని విజ్ఝప్తి చేశారు.

హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత యేడాది జీహెచ్ ఎంసీపై మంత్రి కేటీఆర్ ఫోకస్ చేసినట్టు కనిపించింది. అయితే, మంత్రి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో.. వర్షంపడినప్పుడల్లా నగర వాసులకి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. బహుశా.. వచ్చే సాధారణ ఎన్నికల లోపయిన హైదరాబాద్ ప్రజలకి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుతాయేమో చూడాలి.

(Visited 1,422 times, 1 visits today)