Home / Entertainment / హలో గురు ప్రేమకోసమే…సినిమా రివ్యూ

హలో గురు ప్రేమకోసమే…సినిమా రివ్యూ

Author:

అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రయాణం ఈ మధ్య అంత సాఫీగా సాగట్లేదు. ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు హీరో రామ్ కూడా ‘ఉన్నది ఒకటే జిందగీ’ తో నిరాశ చెందాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరిస్థితీ అంతంతమాత్రమే. వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ’.. ‘నేను లోకల్’ లాంటి చిత్రాలతో సత్తా చాటుకున్న త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సరదాగా స్నేహితులతో కలిసి తిరిగే సంజయ్ (రామ్‌) ఉద్యోగం కోసం హైదరాబాద్‌కి వెళ్లి అక్కడ తన తల్లి స్నేహితుడి విశ్వనాథం (ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో వుంటాడు. శ్వనాథం కూతురైన అను (అనుపమ పరమేశ్వరన్)తో అతను తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు. కానీ విశ్వనాథం ఆమె మరో పెళ్లి ఖాయం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో అనును దక్కించుకోవడానికి సంజయ్ ఏం చేశాడన్నది మిగతా కథ.

hello-guru-prema-kosame-movie-review-rating

అలజడి విశ్లేషణ:

‘హలో గురూ ప్రేమ కోసమే’లో హీరో తన ప్రేమను హీరోయిన్ తండ్రికి చెబితే.. అతను ఒక తండ్రిగా వ్యతిరేకిస్తూ.. ఒక ఫ్రెండుగా మాత్రం అతడికి సహకారమందించడానికి సిద్ధపడతాడు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించే పాయింట్ ఇదొక్కటే. కానీ ఈ విషయం మరీ ఎబ్బెట్టుగా అనిపించకుండా వినోదపు పూతతో కన్విన్సింగ్ గా చెప్పడానికి ప్రయత్నించారు రచయిత ప్రసన్న కుమార్.. దర్శకుడు త్రినాథరావు. సినిమా ఎక్కడా కూడా భారంగా అనిపించకుండా.. సరదాగా సాగిపోవడం ‘హలో గురూ ప్రేమ కోసమే’కు ప్లస్. పాత్రల్ని కూడా అలాగే తీర్చిదిద్దారు. కమెడియన్ల మీద ఆధార పడకుండా రామ్-ప్రకాష్ రాజ్ లే వినోదాన్ని పంచే బాధ్యత తీసుకున్నారు.

ప్రథమార్ధంలో యూత్ ఫుల్ గా సాగే సన్నివేశాలు.. మాటలు యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో పని చేసే సాఫ్ట్ వేర్ ఆఫీస్ నేపథ్యంలో సాగే సీన్లు నవ్వులు పంచుతాయి. రెండో హీరోయిన్ క్యారెక్టర్ని తేల్చి పడేసినా.. ఆ పాత్రతో ముడిపడ్డ కొన్ని సీన్లు నవ్విస్తాయి. రామ్-అనుపమ మధ్య వచ్చే సీన్లు కూడా పర్వాలేదు. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి.. బలపడటానికి సరైన కారణాలు కనిపించవు. ఈ విషయంలో శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. మరీ సింపుల్ సీన్లతో తేల్చేశారు. దీని వల్ల ద్వితీయార్ధంలో ఒకరి కోసం ఒకరు తపించే సీన్లు సరిగా పండలేదు. ద్వితీయార్ధం మొదలవగానే ఈ కథ ఎలా ముగియబోతోందన్న దానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేస్తారు.  అక్కడైనా ఏమైనా ప్రత్యేకంగా ఉంటే ‘హలో గురూ..’ భిన్నమైన ఫీలింగ్ ఇచ్చేదేమో కానీ. ఓవరాల్ గా ఇది జస్ట్ ఓకే అనిపిస్తుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

రామ్ తనకు నప్పే పాత్రలో రాణించాడు. ఇందులోని సంజు క్యారెక్టర్ చాలా చోట్ల ‘నేను శైలజ’లో కథానాయకుడి పాత్రను గుర్తుకు తెస్తుంది. అందులో మాదిరే రామ్ అతి చేయకుండా తన పాత్రను అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించాడు. కామెడీ సీన్లలో రామ్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. రామ్ లుక్ కూడా బాగుంది. కెరీర్లో ది బెస్ట్ లుక్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. కాకపోతే ఆ పాత్రలో ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. ఆమెకు కథలో ఉండాల్సినంత ప్రాధాన్యం లేదు. అనుపమ టాలెంట్ చూపించేందుకు ఎక్కువ స్కోప్ లేకపోయింది. కానీ అవసరమైనపుడు అనుపమ తన ప్రత్యేకతను చాటుకుంది. లవ్ ప్రపోజ్ చేసే సీన్లో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రకాష్ రాజ్ సినిమాకు పెద్ద బలంగా నిలిచాడు. అలవాటైన పాత్రే అయినప్పటికీ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రణీత సినిమాకు మైనస్ అయింది. ఆమె లుక్ పేలవంగా ఉంది. పాత్రలోనూ విశేషం లేదు. ప్రణీత స్థానంలో మరో గుడ్ లుకింగ్ హీరోయిన్ని పెట్టాల్సిందనిపిస్తుంది. సితార.. పోసాని.. ఆమని.. ప్రవీణ్.. వీళ్లంతా తమ పరిధిలో బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్ :

  •  రామ్ నటన
  • ఫస్ట్‌ హాఫ్‌ వినోదం

మైనస్ పాయింట్స్ :

  • సంగీతం
  • సెకండ్‌ హాఫ్‌
  • రొటీన్‌ స్టోరి

పంచ్ లైన్:  కాలక్షేపానికి పనికి వస్తుంది.

రేటింగ్ :  3/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

(Visited 1 times, 1 visits today)