Home / Reviews / హలో సినిమా రివ్యూ & రేటింగ్.

హలో సినిమా రివ్యూ & రేటింగ్.

హలో రివ్యూ అఖిల్

Alajadi Rating

3.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అఖిల్, కళ్యాణి, రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్..తదితరులు

Directed by: విక్రమ్ కె కుమార్

Produced by: నాగార్జున అక్కినేని

Banner: అన్నపూర్ణ స్టూడియోస్ & మనం ఎంట్రప్రెజెస్

Music Composed by: అనూప్ రుబెన్స్

అక్కినేని అఖిల్ తన మొదటి సినిమాని ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చాలా గ్యాప్ తీసుకోని ‘మనం’ ‘ 24 ‘ సినిమాల డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శన్ అనే కొత్త హీరోయిన్ తో ‘హలో; అంటూ మన ముందుకు వస్తున్నాడు, ట్రైలర్, సాంగ్స్ తో ఇప్పటికే అంచనాలు పెంచిన ‘హలో’ ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

పదేళ్ల శీను(అఖిల్) ఒక అనాథ, జున్ను (కళ్యాణి ప్రియదర్శన్) ఒక పెద్దింటి అమ్మాయి,అనుకోకుండా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, కొన్ని కారణాలతో జున్ను వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వస్తుంది, విడిపోయి పదిహేనేళ్ళు దాటినప్పటికీ ఒకరినిఒకరు అస్సలు మరిచిపోరు, ఎలాగైనా కలవాలని ఇద్దరు ప్రయత్నిస్తుంటారు, మరి వీళ్ళు కలిసారా..? సరిజోని(రమ్య కృష్ణ), ప్రకాష్ (జగపతి బాబు) లకు వీళ్ళతో సంబంధం ఏంటి..? చివరికి ఏమైంది..? అనేది తెరమీదనే చూడాలి.

అలజడి విశ్లేషణ:

చిన్నప్పుడు విడిపోయి పెద్దయ్యాక కలుసుకోవడం అనే కథ ఇప్పటికే మనసంతా నువ్వే, బుజ్జిగడు సినిమాలలో చూసినప్పటికీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఏ మాత్రం బోర్ కొట్టించకుండా ఒక కొత్త కథ చూస్తున్నాం అని ఫీల్ అయ్యేలా సినిమా తీయడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు.

ఫస్ట్ ఆఫ్ లో చిన్నప్పుడు శీను, జున్నుల మధ్య సన్నివేశాలను సూపర్బ్ గా తెరకెక్కించారు, వాళ్ళు విడిపోయిన అప్పటి నుండి పెద్దయ్యే వరకు చూపించిన సన్నివేశాలు, రమ్యకృష్ణ, జగపతి బాబు ల సన్నివేశాలు అన్ని చాలా బాగా తీశారు.

ఇంటర్వెల్ తరువాతనే అసలు కథ మొదలవుతుంది, ఫోన్ కాల్ చుట్టూ కథ తిరగడం, అవినాశ్‌, ప్రియలుగా పరిచయమై ఆ తర్వాత వారిద్ద‌రూ తాము చిన్న‌ప్ప‌టి స్నేహితుల‌మ‌ని తెలుసుకోవ‌డం త‌దిత‌ర‌ సన్నివేశాలతో సినిమా ఆహ్లాదంగా సాగుతుంది. హాలీవుడ్ రేంజ్ స్టంట్ లతో అఖిల్ మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు, క్లైమాక్స్ లోని సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి, చివరగా కథ పాతదే అయినప్పటికీ కథనం మాత్రం చాలా కొత్తది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

అఖిల్: యాక్షన్ సీన్స్ లో ఇరగదీసిన అఖిల్..సినిమా మొత్తం సెటల్డ్ గా నటించాడు, పర్ఫెక్ట్ లవర్ బాయ్ గా నటించాడు.

కళ్యాణి ప్రియదర్శన్: కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేం. అంతలా ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఫుల్ మార్క్స్ సాధించింది.

జగపతిబాబు రమ్యకృష్ణల నటన సూపర్బ్. వాళ్ల పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. అజయ్ ది చిన్న పాత్రే అయినా తనదైన నటనతో మెప్పించాడు.

ప్లస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • యాక్షన్ ఎపిసోడ్స్
  • సినిమాటోగ్రఫీ
  • అఖిల్ , కళ్యాణి
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ

పంచ్ లైన్: హలో…సినిమా సూపర్.

(Visited 299 times, 1 visits today)