Home / Latest Alajadi / మీ ఆధార్ కార్డుని మీకు తెలియకుండా ఎవరైనా ఉపయోగిస్తే ఆ వివరాల కోసం ఇలా చేయండి.

మీ ఆధార్ కార్డుని మీకు తెలియకుండా ఎవరైనా ఉపయోగిస్తే ఆ వివరాల కోసం ఇలా చేయండి.

Author:

ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ కార్డు వాడాల్సిందే… కొత్త సిమ్ తీసుకోవాలన్న, కొత్త వెహికిల్ కొనాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్న..ఇంకా అనేక పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి అయింది, గవర్నమెంట్ కూడా పారదర్శకత పేరుతో క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ ని తప్పనిసరి చేస్తుండటంతో రోజురోజుకి ఆధార్ నెంబర్ లని దుర్వినియోగం చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు, ముఖ్యంగా కొత్త సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్ ల విషయంలో ఆధార్ కార్డుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుంది.

ఆధార్

మనం ఏదో అవసరం కోసం ఇచ్చిన ఆధార్ నెంబర్ ని మనకి తెలియకుండానే వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు, నోట్ల రద్దు జరిగినప్పుడు ఇలా చాలామంది పాత నోట్ల మార్పిడి కోసం వేరేవాళ్ళ ఆధార్ నెంబర్ లని అక్రమంగా ఉపయోగించి లబ్దిపొందారు, ఇలాంటి మోసాలు ఈమధ్య ఎక్కువైపోతున్నాయి.. మన ఆధార్ నెంబర్ ని ఎవరైనా మనకి తెలియకుండా ఉపయోగించారా.. అనే విషయం ఆధార్ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ఆధార్ వెబ్ సైట్ లో మన ఆధార్ కార్డుని ఇప్పటివరకు ఉపయోగించిన వివరాలని తెలుసుకోవాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

1.ఆధార్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.  Click On – https://resident.uidai.gov.in/

2. ఆధార్ అతెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి… అక్కడున్న సెక్యురిటీ కోడ్ నెంబర్ ని ఎంటర్ చేయండి.

ఆధార్ కార్డు వెరిఫికేషన్

3. OTP ని జనరేట్ చేయండి.

4. మీ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది.

5. ఇప్పుడు ఆధార్ కి సంబంధించిన సమాచారం కోసం డేట్ రేంజ్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి Submit Option పై క్లిక్ చెయ్యాలి.

ఆధార్ కార్డు వెరిఫికేషన్

6. ఇప్పుడు మీరు Select చేసుకున్న కాలంలో మీ ఆధార్ ఎప్పుడెప్పుడు ఉపయోగించారో అనే వివరాలు వస్తాయి.

ఆ వివరాలలో మీకు తెలియకుండా మీ ఆధార్ ఉపయోగించినట్లు అనిపిస్తే వెంటనే లోనే ఆన్ లైన్ ఫిర్యాదు చేయొచ్చు.. అలాగే మీ ఆధార్ కార్డుని ఎవరు ఉపయోగించకుండా Online Lock కూడా వేయొచ్చు..మీరు కావాలనుకున్నప్పుడు Unlock చేసి వాడుకోవచ్చు.

(Visited 1,029 times, 1 visits today)