Home / Inspiring Stories / Video: ఫేస్ బుక్ దెబ్బకు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం పోయింది.

Video: ఫేస్ బుక్ దెబ్బకు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం పోయింది.

Author:

ట్రాఫిక్ పోలీసులు నగరంలోని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడంలో ఎంత దిట్టలో రూల్స్ పాటించని వారి నుండి డబ్బులు గుంజడంలో కూడా అంతే దిట్టలు. ప్రభుత్వం పోలీసుల అవినీతిని అడ్డుకోవడానికి పారదర్శకత పేరుతో చలానాలు ఆన్ లైన్ లో చెల్లించే సదుపాయం కల్పించినా, పోలీసుల శరీరాల మీదా కెమెరాలు పెట్టినా కూడా వారి అవినీతి ఆగడం లేదు. రూల్స్ పాటించని వారి నుండి చలానాలు వసూలు చేసి ప్రభుత్వానికి చేరాల్సిన డబ్బుని కొంత మంది ట్రాఫిక్ పోలీసులు మధ్యలోనే నొక్కేస్తున్నారు. అలాంటి పాడు పనే చేస్తూ ఒక ట్రాఫిక్ పోలీసు కెమెరా కంట చిక్కాడు. ఆ వీడియో తీసిన వ్యక్తి దానిని సోషల్ మీడియా వెబ్ సైట్లలో, ఫేస్ బుక్ లో పెట్టడంతో ఇది పోలీస్ బాసుల దాక చేరి ఆ ట్రాఫిక్ పోలీసును సస్పెండ్ చేసే దాక వెళ్ళింది.

ఈ సంఘటణ మార్చి 17 సాయంత్రం హిమాయత్ నగర్ జంక్షన్ వద్ద జరిగింది, హెల్మెట్ దరించని ఒక టూ వీలర్ డ్రైవర్ దగ్గరి నుండి డబ్బులు వసూలు చేస్తూ ట్రాఫిక్ పోలీస్ సత్య విష్ణు ఇతర ప్రయాణికుల కెమెరా కి దొరికాడు. ఆ వీడియో ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్ బుక్ పేజీకి పంపించారు ఆ వీడియో తీసిన వ్యక్తి అంతే ఆ వీడియో వైరల్ గా మారిపోయి 4000 పైగా మంది దానిని షేర్ చేసారు. ఈ విషయం పోలీస్ బాసులకు తెలిసి ఆ ట్రాఫిక్ పోలీస్ ను ఉద్యోగం నుండి తాత్కాలికంగా తొలగించి తదుపరి చర్యలకు ఉపక్రమించామని తెలిపారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కాని ఎవరు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకున్నా కేవలం సోషల్ మీడియా పోస్ట్ తో అవినీతిపరుడి ఉద్యోగం పోయిందంటే మన దేశం మారుతున్నట్లే.

(Visited 797 times, 1 visits today)