Home / User Stories / కాణిపాకం వినాయకుడి ఆలయ చరిత్ర.. నిజాలు…!

కాణిపాకం వినాయకుడి ఆలయ చరిత్ర.. నిజాలు…!

Author:

హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేయాలన్న మొదటగా పూజించేది వినాయకుడిని. వినాయకుడి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యత ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుడిని ఎవరు ప్రతిష్టించలేదు తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుడిని ‘స్వయంబు’ అంటారు. కాణిపాకం అంటే ” వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు” అని అర్ధం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరు ఉంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడు హాయిని కలిగిస్తుంది.

kanipakam-vinayaka-temple

ఈ ఆలయం గురించి మరి కొన్ని విశేషాలు :

  • కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల వ్యవసాయ భూమి. కొద్దీ రోజులకు వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయి అని తవ్వడం మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దీ కొద్దిగా బావి నిండుతుంది… ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగ బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరి కాయల నీరు ఒకటి మరియు పావు ఎకరము అంత విస్తీర్ణము పారింది దానితో ఆ స్థలానికి “కాణిపరకం ” అనే తమిళ పేరు వచ్చింది, అదే వాడుకలోకి వచ్చెటప్పటికి “కాణిపాకం” గా మారింది.
  • ఈ ఆలయాన్ని పదకొండవ శాతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు.రోజు రోజుకి పరిమాణం పెరగడం కాణిపాకం వినాయకుడిని విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికి విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరియు ఆ బావి నీరు ఎప్పటికి ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రముగా భావించి భక్తులకు తీర్థముగా ఇస్తారు.
  • కాణిపాకం వినాయకుడిని సత్యానికి మారుపేరుగా కొలుస్తారు అందుకే ఆ చుట్టుపక్క గ్రామాలలో ఇప్పటికి ఎవైన తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తాడు అని అక్కడి ప్రజల నమ్మకం.
  • ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది, వీలుచిక్కినప్పుడు దర్శించుకొని ఆ వినాయకుడి దీవెనలు పొందండి.
(Visited 3,429 times, 1 visits today)