Home / Political / హోదాలదేముందీ మాకు ప్యాకేజీ నే కావాలి – చింతా మోహన్

హోదాలదేముందీ మాకు ప్యాకేజీ నే కావాలి – చింతా మోహన్

Author:

తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా ప్రయత్నించి మరీ మోడీ ముందు
బోల్తాపడ్దంత పనయ్యింది. ఆశపెట్టిన మోడీ మొండిచెయ్యి చూపించాడు. నిజమెంతో తెలియదు కానీ ప్రత్యేక హోదాలో ఏముందీ? ప్యాకేజ్ లో మీకు
అంతకన్నా ఎక్కువే ఇస్తాం అని కూడా సెలవిచ్చారూ భారత ప్రధాని. దాంతో ఆంధ్రప్రదేశ్ ఆశల మీద నీళ్ళు చల్లినట్టయ్యింది. ఉద్రిక్త పరిస్తితులు
నెలకొన్నాయి ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఆత్మ హత్యలూ మొదలయ్యాయి. తమ రాష్ట్రానికి మరో సారి అన్యాయం చెయ్యొద్దంటూ ప్రజలు కోరుతున్నారు.ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు ఏ.పీ. ముఖ్యమంత్రి చంద్రబాబు..

ఐతే ప్రత్యేక హోదా ఒక కుట్ర అనీ దానికంటే ప్యాకేజీ ముఖ్యమనీ అంటున్నారు కాంగ్రేస్ సీనియర్ నేత చింతా మోహన్.200 మంది బడా పారిశ్రామిక వేత్తలంతా కుమ్మక్కై తాము చెల్లించాల్సిన భారీ పన్నుల నుంచి తప్పించుకోవటానికే  “ప్రత్యేక హోదా”ని కోరుకుంటున్నారనీ, తప్పుడు ప్రచారం తో ప్రజలను మోసం చేస్తున్నారనీ ఆయన ఆరో పించారు. అందుకే తమకు ప్రత్యేక హోద వద్దు అనీ ప్యాకేజీ వల్లనే అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయనీ ఆయన అన్నారు.

తిరుపతిలో ఈ రోజు ఉదయం శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ నుంచీ అంబేద్కర్ విగ్రహం వరకూ పాద యాత్ర చేసిన ఆయన. ఈ సందర్బంగా మాట్లడుతూ సమైఖ్య రాష్ట్రం లో తెలంగాణా కన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమే అనీ, ప్యాకేజీ లో భాగంగా తమ ప్రాంతమైన రాయలసీమకు 57వేల కోట్లు కేటాయించాలనీ, అందులో బాగా వెనుక బడి ఉన్న చిత్తూరు జిల్లాకు 10వేల కోట్లు మంజూరు చెయాలనీ ఆయన డిమాండ్ చేసారు.. ఐతే చింతా మోహన్ ఎం చెస్తున్నరో తమకు అర్థం కావట్లేదనీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం వల్ల జరిగే ఉపయోగాలు ఆయనకు తెలియవనీ విమర్శిస్తున్నారు… కొందరు టీడీపీ నేతలు..

(Visited 63 times, 1 visits today)