Cast: దిలీప్, దక్ష, రాఘవ, షీనా, చెష్వా తదితరులు
Directed by: తేజ
Produced by: దామోదర ప్రసాద్
Banner: శ్రీ రంజిత్ మూవీస్
Music Composed by: కళ్యాణి కోడూరి
చాలా కాలం తర్వాత తన కొత్త సినిమాతో ముందుకు వస్తూన్న తేజా హోరా హోరీ పైన భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం తన పద్దతికి భిన్నంగా చాలానే చెసాడు. అన్ని సినిమాలూ రెండు పాయింట్ల మీదే తీస్తున్నారూ అంటూ, అంతేకాకుండా మహేష్ బాబు మీద అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నించి వివాదం లో కూడా చిక్కు కున్నాడు . ఐతే తేజ ప్రయత్నం హోరాహోరీ ఎంతవరకూ తేజా అనుకున్న లక్ష్యాలని చేరుకుంటుందో చూడండి…
తేజ మార్కు సినిమా అనగానే ప్రతీ ప్రేక్షకుడికీ గుర్తొచ్చేది నువ్వూ-నేనూ,జయం సినిమాలే. ఈ సారి కూడా తేజా ప్రేక్షకుడిని పెద్ద కణ్యూజ్ చేయకుండా అదే ఫార్ములాని వాడాడు ఇక కథలోకి వస్తే..ఒక పోలీసాఫీసర్ చెల్లెలు మైథిలి (ధీక్ష). మైథిలి పెళ్ళికోసం మెయిన్ విలన్ అయిన బసవేశ్వర్(చష్వా) నుంచి 25 లక్షలు లంచం తీసుకుంటాడు.అదే పనిమీద వచ్చిన బసవేశ్వర్ మైథిలిని చూసి ప్రేమలో పడిపోతాడు ఆమె తనకే దక్కాలని లనుకుంటాదు. కానీ మైథిలి ఒప్పుకొక పోవటంతో ఆమెకు వచ్చే పెళ్ళీ సంబందాల లో పెండ్లి కొడుల్ని చంపేయటం మొదలుపెడతాడు. దాంతో షాక్‌కు గురయిన మైథిలిని డాక్టర్లు సూచన మేరకు కొత్త ప్రాంతానికి తీసుకెళతారు. అది గ్రీనరీ బాగా వుండే కర్నాటకలోని అగుంబే అనేమారుమూల ప్రాంతం.
అదే వూరిలో చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవిస్తూంటాడు స్కంద(దిలీప్)బామ్మను, అక్క లత సంతోషంగా ఉన్న స్కంద కి పక్క ఊరిలోని ఓ వ్యక్తి పోటీ అవుతాడు.దాంతో వ్యాపారం దెబ్బతింటుంది. ఊరి పంచాయితీ ప్రకారం ఓ పోటీ పెడతారు.ఆ పోటీలో ఓడిన వారు మాత్రమే వ్యాపారం చేయాలి మిగతావారు ఆ వ్యాపారాన్ని విరమించుకోవాలి. అదే టైమ్‌లో ఆ ఊరికి వచ్చిన మైథిలి ఈ పోటీలో స్కంద గెలవటానికి కారణం అవుతుంది. అప్పుడే స్కంద, మైథిలి ల మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. ఆ పోటీ ఏమిటీ? మైథిలి చేసిన సహాయం ఎలాంటిదీ అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఆ ఊరికి వచ్చిన బసవేశ్వర్ అనుకోకుండా మైథిలిని చూస్తాడు. ఇక్కడినుంచీ సినిమాలో మలుపులు మొదలవుతాయి. బసవేశ్వర్, స్కందా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఐపోతారు. ఇలాంటి పరిస్తితుల్లో మైథిలి రియాక్షన్ ఏమిటీ? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో ఎలా స్కంద బసవ లాంటి విలన్ ని ఎదుర్కున్నాడు? అసలు చివరికి స్కంద ఏమయ్యాడు అనేది తెరమీదే చూడాలి
దాదాపు తన ప్రతి సినిమాలోనూ కొత్త నటీనటుల్ని పరిచయం చేసే తేజ ఈ సినిమా కోసం కూడా అందరినీ కొత్త వారినే ఎంచుకున్నాడు.రెమ్యున రేషన్ తగ్గించుకోవటం కోసమే తేజా ఈ పద్దతిని ఫాలో అవుతడూ అనే వాళ్ళూ ఉన్నారు.
దిలీప్: హీరో అయిన దిలీప్ విషయానికి వస్తే.. పల్లెటూరి లో ఉండే అమయక యువకుదిగా పాత్రకి బాగానే సరిపోయాడు.కానీ నటనలో పెద్ద ప్రతిభ ఏమీ లేదు. కానీ అసలు నటించేటంత గొప్ప క్యారెక్టర్ ని తేజా ఇవ్వలేదనే అనొచ్చు. ఎందుకంటే అమాయకంగా చూడటం,అతిగా బాదపడటం లాంటి ఎప్పుదూ ఉండే తేజా మార్క్ హీరో నే కనిపించాడు తప్ప కొత్తగా నటించిందేం లేదు. అందుకే హీరోకన్నా మిగతా పాత్రలు హైలైట్ అయ్యాయి. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోకపోవడం తనకి పెద్దగా సెట్ అవ్వలేదనిపిస్తుంది.
దక్ష: ఇక నటీనటుల్లో హైలైట్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ దక్ష అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దక్ష ఇచ్చిన పాత్రలో చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మొదటి నుంచి క్యూట్ క్యూట్ గా కనిపించిన దక్ష ఎమోషనల్ సీన్స్ లో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. చాలా చోట్ల తన లుక్స్ తో యువతని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తనకు తెలుగు పూర్తిగా రాకపోయినా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా నటీనటుల్లో ఎవరికన్నా హెల్ప్ అయ్యిందా అంటే అది దక్షకి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అశ్విని: ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన అశ్విని కేవలం మసాలా కోసమే.తన పాత్రని తాను పర్ఫెక్ట్ గా చేసి కాసేపు మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు అందాలని ఆరబోసి వెళ్ళిపోయింది. విలన్ గా చేసిన కన్నద నటుడు చస్వ పెర్ఫార్మన్స్ తో బాగానే మెప్పించాడు. అంతే కాకుండా తన ఒరిజినల్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. హీరో నానమ్మ పాత్రలో సీమ, హీరోయిన్ అన్న పాత్రలో అభిరామ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. జబర్దస్త్ గ్యాంగ్ అయిన రాకింగ్ రాకేష్, రాఘవ, రచ్చ రవిలు అక్కడక్కడా నవ్వించారు.
ఐతే హీరో-విలన్ ల క్యారెక్టర్ల ని మరీ పేలవంగా తయారు చేయటం తో మొత్తానికి హోరా హోరీ నటీనటుల్లోదక్ష కి తప్ప ఎవరికీ ఏమీ హెల్ప్ చేయదు అని చెప్పవచ్చు.
‘హోరా హోరీ’ కి మూల హీరో తేజ గురించి చెప్పాలంటే కొత్తగా ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పటి వరకూ ఆయన చెప్పిన ఒకె ఫార్ములా “జయం” పల్లెటూరి ప్రేమకథనే మరో కోణంలో, మరో బ్యాక్ డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేసాడు. ఒకే ఫార్ములా ని వాడి అటు తిప్పీ ఇటు తిప్పీ ఒకే పాయిత్ తో సినిమా తీయటం లో తేజా ఎక్స్ పర్ట్. సినిమా మొదటి 10 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏమిటో తెలిసిపోతుంది. ఇక మరీ చెప్పాలంటే క్లైమాక్స్ అయితే పూర్తిగా జయం సినిమాకి కాపీ పేస్ట్ లా అనిపిస్తుంది. ఇక నేరేషన్ పరంగా చూసుకుంటే మరీ సాగదీత గా, బోరింగ్ అనిపించేలా చాలా సేపు సీన్లని లాగుతున్నట్టు అనిపించేలా నేరేట్ చేసాడు తేజా. మొత్తానికి తేజా ఇంక అప్ డేట్ కాలేదా అనిపించక మానదు. ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఓ కొత్త ఫీలింగ్ ని కలిగించింది. ఎప్పుడు ఎక్కువగా వర్షం పడే ఆగుంబె ప్రాంతాన్ని అద్బుతంగా తెరకెక్కించాడు. కళ్యాణి కోడూరి మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి పాటలు హెల్ప్ అయ్యాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. ఎడిటర్ జునైద్ తన కత్తెరని ఇంకాస్త వాడి ఉంటే బావుండేది. పాంథర్ స్టంట్స్ పర్లేదనిపించాయి. కెఎల్ దామోదర ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు కీలకం బ్యాక్‌గ్రౌండ్. ఆ విషయంలో కళ్యాణి కోడూరి బాగా చేశాడు. కథకు అనుగుణంగా మూడ్‌ను కల్గించాడు. సందర్భానుసారంగా వచ్చే మాటల్లాంటి పాటలకు తగిన విధంగా ట్యూన్స్ ఇచ్చేశాడు. కెమెరాకు పెద్ద పని. ఎందుకంటే. సినిమా సగానికి పైగా వర్షంలోనే పచ్చని లొకేషన్ లలో సాగుతుంది. అందుకోసం కెమెరా తడవకుండా.. తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్టిస్టులను ఒకటిరెండు సార్లు తడిపి నటింపచేయడం జరిగింది. లొకేషన్ లు సహజమైనవే కాబట్టి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు పెద్దగా పనిలేదు. అలాగే కాస్ట్యూమ్స్ కూడా సాదాసీదా డ్రెస్‌లే. 159 నిమిషాల నిడివిని ఎలా ఎడిటింగ్ చేయాలన్నా.. దర్శకుడు దృష్టిలో కష్టమే. అందుకు ఎడిటర్‌కు ఒక రకంగా పరీక్షే. ఇక మిగిలిన డిపార్ట్‌మెంట్లన్నీ పరిధి మేరకు చేసేశాయి.
సినిమా ఆడియో విడుదల టైం నుంచీ కేవలం రెండు రకాల కథల మీదే ప్రస్తుత సినిమాలు వస్తున్నాయి, కొత్తగా ఆలోచించటమే లేదు అన్నారు. ఇది విని అందరూ ఆయనేదో ఓ కొత్త టైపు లవ్ స్టోరీ తీసాడేమో అనుకొన్న వాళ్ళు తప్పక నిరాశ పడతారు. తేజ పెద్ద హిట్ లు వచ్చి చాలా కాలం అయింది హోరా హోరీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూదాల్సిందే. ఈ సినిమా కథనం ఇప్పటికే తేజ నువ్వునేను, జయం సినిమాల్లో చూసినట్టే ఉంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ముందు అరగంటలోనే సినిమా ఎలా ఉందనేది తెలిసిపోతుంది. తర్వాత స్టోరీని ముగించడానికి తేజ కథను కిచిడీ చేసి ఊహాజనితంగా మార్చేశాడు. ఇక సినిమా కూడా స్లో నేరేషన్. ఎంటర్‌టైన్ మెంట్ పాళ్లు తక్కువే. ఇక చివరిగా తేజ సినిమాల్లో ఎమోషనల్ సీన్లు అన్నా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఓవరాల్‌గా తేజ సినిమాలో ఎప్పుడూ చూసే పిరికి హీరో కాస్త చివర్లో విలన్‌ను కొట్టే ఫార్ములానే ఇక్కడా కనపడుతుంది.కాస్త హింట్ ఇచ్చినట్టు ఆంజనేయ స్వామి జండాని కూడా ఒక షాట్ లో చూపించాడు లెండి. ఈ కథ విషయానికి వస్తే పాయింట్ చాలా చిన్నది దీన్ని రెండు గంటల నలభై నిముషాల సినిమాగా మలిచేందుకు, క్లైమాక్స్ వరకు ఆడియన్స్‌ని కూర్చోబెట్టేందుకు పడరాని పాట్లు పడ్డాడు. రొటీన్ కథకి పసలేని మాటలు, నవ్వు తెప్పించని కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఆ పల్లెటూళ్ళో రెండు ఇంటర్నెట్ సెంటర్ల మధ్య టైపింగ్ పోటీలు పెట్టడం, హీరోయిన్ ఒక్క వేలుతోనే టైప్ చెయ్యడం, విలన్ ఎప్పుడూ సినిమాలు చూస్తూ అనుచరులతో కామెడీ చెయ్యడం, పేరుకి హీరో అయినా ఎక్కడా హీరోయిజం అనేది చూపించకపోవడం వంటి అంశాలు సినిమాకి పెద్ద మైనస్‌లుగా మారాయి. దీపక్ భగవంత్ అందించిన ఫోటోగ్రఫీ, కళ్యాణ్ కోడూరి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పెద్దాడమూర్తి పాటలు ఎంత బాగున్నా అవి సినిమాని కాపాడలేకపోయాయి. పేరుకి దిలీప్ హీరో అయినా అతని హీరోయిజం క్లైమాక్స్‌లో తప్ప ఎక్కడా కనిపించదు. ఒక విధంగా విలన్ బసవేశ్వరే హీరోలా అనిపిస్తాడు. సాధారణంగా ప్రేమకథల పోటీని తట్టుకొని హిట్ కొట్టాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిస్తేనే ఫలితం వస్తుంది. మరి తేజా తన రొటీన్ ఫార్ములా నుంచి ఎప్పటికి బయటికి వస్తాడో…