Home / Latest Alajadi / ATM పిన్ నెంబర్ మర్చిపోయారా..? ఒక్క నిమిషంలోనే తెలుసుకోవచ్చు..!

ATM పిన్ నెంబర్ మర్చిపోయారా..? ఒక్క నిమిషంలోనే తెలుసుకోవచ్చు..!

Author:

నోట్ల రద్దు నిర్ణయంతో డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు చేసేవారి సంఖ్య పెరిగిపోయింది,  ఏటీఎం కార్డుతో లావాదేవీలు చేయాలంటే పిన్ నెంబర్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ పిన్ నెంబర్ మరచిపోతే వెంటనే బ్యాంకుకి వెళ్లి కొత్త పిన్ కోసం అప్లై చేయడం అది నెల రోజుల తరువాత రావడం జరిగేది, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీతో కొత్త ఏటీఎం పిన్ ని ఒక్క నిమిషంలోనే పొందవచ్చు.

how-to-change-atm-pin

కొత్త ఏటీఎం పిన్ ని జనరేట్ చేయాలంటే ఇలా చేయండి:

  • మీకు దగ్గరలో ఉన్న మీ బ్యాంకు అకౌంట్ కి సంబంధించిన ఏటీఎం కి వెళ్ళండి.
  • ఏటీఎం మెషిన్ లో మీ కార్డుని పెట్టండి, అప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
  • ఆ ఆప్షన్స్ లలో Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత Pin Generate లేదా Pin Reset లేదా Forgot Pin అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
  • మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ని , ఫోన్ నెంబర్ ని ధృవీకరించాలి.
  • అప్పుడు మీ బ్యాంకు అకౌంట్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కి OTP (One Time Password) వస్తుంది.
  • ఆ OTP ని ఎంటర్ చేసి పాత పిన్ నెంబర్ ని మార్చుకోవచ్చు.
  • ఆ వెంటనే కొత్త పిన్ యాక్టివేట్ అవుతుంది.

ఏటీఎం ల దగ్గర, స్వైప్ మెషిన్ ల దగ్గర లావాదేవీలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లావాదేవీలు చేసే సమయంలో మనం ఏమరుపాటుగా ఉంటే ఒక్క నిమిషంలో మన పిన్ నెంబర్ ని తెలుసుకోగలరు కాబట్టి డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

(Visited 4,276 times, 1 visits today)