Home / Latest Alajadi / ఒక్క క్లిక్ తో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు, ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

ఒక్క క్లిక్ తో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు, ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

Author:

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆధార్ కార్డు వల్ల ఒకరికి ఒకటే పర్మినెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అన్ని అవసరాలకి ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది, ఎంతో ముఖ్యమైన ఆధార్ కార్డుపై తప్పులు ఉంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది, ఆధార్ కార్డు డిటైల్స్ లో తప్పులు ఉంటే ప్రభుత్వ పథకాలని సరిగ్గా పొందలేము. భవిష్యత్ లో ఆధార్ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థ తెస్తాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఆధార్ లో అన్ని వివరాలు సరిగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.

Changes-In-Aadhar-Card

ఇన్ని రోజులు ఆధార్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవడానికి, ఆధార్ కేంద్రానికి, ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు ఈ సమస్య లేకుండా ఆన్ లైన్ ద్వారానే ఆధార్ వివరాలని మార్చుకోవచ్చు, https://uidai.gov.in/new/ అనే లింక్ ని ఓపెన్ చేసి తప్పులున్న వివరాలని మార్చుకోవచ్చు, కాకపోతే ఇందులో ఆధార్ కార్డు పై ఉన్న ఫోటో ని మార్చుకోలేము, దాని కోసం ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిందే.

(Visited 6,826 times, 1 visits today)