Home / Inspiring Stories / ఆధార్ కార్డుని డౌన్ లోడ్ చేయడం ఎలా..?

ఆధార్ కార్డుని డౌన్ లోడ్ చేయడం ఎలా..?

Author:

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ప్రభుత్వ ఉద్యోగాలకైన, పథకాలకైనా, వివిధ రకాల గుర్తింపు కార్డుల కోసం, బ్యాంకు అకౌంట్స్, లోన్ కావాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఆధార్ కార్డు వల్ల ఒకరికి ఒకటే పర్మినెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అన్ని అవసరాలకి ఆధార్ కార్డు ఉపయోగ పడుతుంది కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏదైనా పొరపాటు వల్ల ఆధార్ కార్డు పోగుట్టుకున్నట్లు అయితే దానిని తిరిగి పొందడం చాలా కష్టంతో కూడుకున్న పని, కొన్ని నెలల పాటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, కాని ఇప్పుడు అలా తిరగకుండా చాలా సులభంగా ఆన్ లైన్ ద్వారా అదార్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది…

ఇంటర్నెట్ ద్వారా ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు:

మీ ఆధార్‌కు సంబంధించిన Enrollment ID, ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowledgement form పై ఈ ఐడీ ఉంటుంది. అలానే మీ పేరు, ఏరియా పిన్ కోడ్, ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీరిచ్చిన మొబైల్ నెంబర్.

  • మెదటగా ఆధార్‌కు సంబంధించిన అధికారిక వైబ్‌సైట్ ఊఈడాఈ ని ఓపెన్ చెయ్యండి, వెబ్‌సైట్ లింక్ www.aadhaar.uidai.gov.in
  • లింక్ ఓపెన్ అయిన తరువాత మీకు స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrolment No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Enrolment No (EID)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
  • కనిపించే ఆప్షన్‌లలో ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowledgement form పై ఉన్న విధంగా Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code, Captcha text ఇంకా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
  • వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని Get One Time Password పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ మెసేజ్ రూపంలో అందుతుంది.
  • ఆ OTPని క్రింది సెక్షన్‌లో ఎంటర్ చేసి వలిదతే & Download పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అయిపోతుంది అయిపోతుంది.
  • PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది, Area Pin Code ఎంటర్ చేస్తే చాలు. మీ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.


ఆన్‌లైన్‌లో మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

  • ముందుగా www.resident.uidai.net.in లింక్‌లోకి వెళ్లండి.
  • స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrolment No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Aadhaar No (UID) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
  • తరువాతి స్టెప్‌లో భాగంగా ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డు కోసం మీరు ధరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.
  • తరువాతి స్టెప్‌లో భాగంగా ఆధార్ కార్డు కోసం మీరిచ్చిన మెయిల్ లేదా ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తరువాత క్రింది బాక్సులో కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఏలా ఉందో అలానే ఎంటర్ చేయండి.
  • Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ మెయిల్ లేదా మొబైల్ నెంబర్ కు OTP అందుతుంది.
  • మీ మొబైల్ లేదా మెయిల్ కు అందిన OTPని Enter OTP* అనే బాక్సులో టైప్ చేసి verify OTP పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్‌కు పంపబడుతుంది.

Must Share: 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 14,434 times, 1 visits today)