Home / Inspiring Stories / రేషన్ కార్డు పోయిందా..? ఇప్పుడు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు పోయిందా..? ఇప్పుడు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Author:

ఏదైనా గవర్నమెంట్ స్కీం కి అప్లై చేయాలి అంటే, మన దగ్గర ఖచ్చితంగా రేషన్ కార్డు ఒరిజినల్ లేదా జీరాక్స్ కాపీ ఉండాల్సిందే, మాములుగా మన రేషన్ కార్డు ఊర్లో ఇంటి దగ్గరే ఉంటది, ఇంతకుముందు అయితే అర్జెంట్ గా కావాలంటే ఉరికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే, కాని ఇప్పుడు మనం రేషన్ కార్డుని ఇంటర్ నెట్ ద్వారా చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, దానిని ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు, చాలా మందికి రేషన్ కార్డుని ఇంటర్ నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలియదు, అందరికి తెలియజేయండి.

ఒక వేళ రేషన్ కార్డు పోయిన ఆధార్ కార్డు నెంబర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవచ్చు, ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ డూప్లికేట్ రేషన్ కార్డు కోసం కాళ్ళు అరిగేల, జేబులు కాలి అయ్యేలా తిరగాల్సిన అవసరం లేదు.

How To Download Ration Card రేషన్ కార్డు డౌన్ లోడ్

  • రేషన్ కార్డుని పొందడానికి రేషన్ కార్డు నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయాలి.

  • తెలంగాణా కి చెందిన వారు రేషన్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవడానికి Epds.telangana.gov.in  అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అందులో పైన వీడియోలో చూపిన విధంగా వివరాలు అందించి రేషన్ కార్డుని పొందవచ్చు.
  • ఆంధ్రప్రదేశ్ చెందిన వారు రేషన్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవడానికి Epds.ap.gov.in  అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అందులో పైన వీడియోలో చూపిన విధంగా వివరాలు అందించి రేషన్ కార్డుని పొందవచ్చు.

Must Read: 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 12,755 times, 1 visits today)