Home / Inspiring Stories / యూట్యూబ్ వీడియోలని ఎలా డౌన్ లోడ్ చెయ్యాలో తెలుసుకోండి..!

యూట్యూబ్ వీడియోలని ఎలా డౌన్ లోడ్ చెయ్యాలో తెలుసుకోండి..!

Author:

ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఏ వీడియో చూడాలన్న ఖచ్చితంగా యూట్యూబ్ లో చూడాల్సిందే, సినిమా ట్రైలర్స్ అయిన, షార్ట్ ఫిలిమ్స్ అయిన, న్యూస్ వీడియోస్ అయిన, కామెడీ వీడియోస్ అయిన ఏ వీడియో అయిన మనం యూట్యూబ్ లో చూసేయొచ్చు. కానీ, యూట్యూబ్ లో ఇంటర్నెట్ ఉన్నంత వరకే మనం వీడియోలు చూడగలుగుతాం. ఒక వీడియోని మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఇంటర్నెట్ ని ఉపయోగించి చూడాల్సిందే కానీ ఆ వీడియోస్ యూట్యూబ్ నుండి డౌన్ లోడ్ చేసుకోలేము.

యూట్యూబ్ ద్వారా నేరుగా  డౌన్ లోడ్ కి ఆవకాశం లేదు. మొబైల్ వినియోగదారులు vidmate లేదా tubemate యాప్ ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ, డెస్క్ టాప్ మరియు లాప్ టాప్ యూజర్లు  కొన్ని వెబ్ సైట్స్ ని ఉపయోగించి యూ ట్యూబ్ వీడియోస్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

How-to-Download-You-Tube-Videos

యూట్యూబ్ వీడియోస్ ని డౌన్ లోడ్ చేయటం ఎలా ?:

  • ముందుగా డౌన్ లోడ్ చేయాలనుకుంటున్న యూట్యూబ్ వీడియో లింక్ (URL) ని copy చేయాలి.
  • ఆ తరువాత en.savefrom.net అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అక్కడ copy చేసిన వీడియో లింక్ ని paste చేయాలి.
  • ఆ తరువాత arrow సింబల్ పై క్లిక్ చేస్తే డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది అప్పుడు డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో డౌన్ లోడ్ అవటం ప్రారంభం అవుతుంది, మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి వీడియో డౌన్ లోడింగ్ టైమ్ ఆధారపడి ఉంటుంది.

ఎలా డౌన్ లోడ్ చేయాలో కింది వీడియోలో కూడా చూడవచ్చు.

en.savefrom.net కి బదులు keepvid.com అనే వెబ్ సైట్ ని కూడా ఉపయోగించవచ్చు.

Must Read: 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 12,713 times, 1 visits today)