Home / Inspiring Stories / ఆధార్, ఓటర్, ఏటియం,పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ కార్డులలో ఏది పోయిన సులభంగా తిరిగి పొందవచ్చు.

ఆధార్, ఓటర్, ఏటియం,పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ కార్డులలో ఏది పోయిన సులభంగా తిరిగి పొందవచ్చు.

Author:

ఇప్పుడు మనకి ప్రభుత్వ పరంగా ఏ పని కావాలన్నా ప్రభుత్వం సూచించిన ఏదో ఒక కార్డుని ఖచ్చితంగా కలిగివుండాలి, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్,ఏటియం కార్డు ఇవన్నీ మనకి ఎక్కడో ఒకచోట అవసరం పడుతాయి, ప్రతి కార్డు ఏదో ఒక సందర్భంలో అవసరం పడుతుంది, ప్రతి రోజు ఈ కార్డులన్నింటిని మన జేబులోనే లేదా పర్స్ లోనే పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా ఈ కార్డులని పోగొట్టుకుంటే ఇంతకుముందు తిరిగిపొందటం చాలా కష్టం అయ్యేది, ఇప్పుడు మాత్రం చాలా సులభంగా డూప్లికేట్ కార్డులని పొందవచ్చు.

15666262_1671623453129964_1790042346_n

డ్రైవింగ్‌ లైసెన్స్:

వాహనం నడిపేందుకు తప్పనిసరిగా ఉండాల్సింది డ్రైవింగ్‌ లైసెన్స్‌. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ పత్రంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందించాలి. అలాగే, రూ.10 బాండ్‌ పేపర్‌పై కార్డు పోవడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందేందుకు అవకాశం ఉంది. రవాణా శాఖా వారి వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌డీ ఫారం డౌన్‌లోడ్‌ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా పోయిన కార్డును పొందవచ్చు.

తెలంగాణ రవాణా శాఖ వెబ్ సైట్: transport.telangana.gov.in
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ వెబ్ సైట్: www.aptransport.org

ఏటీఎం కార్డు:

ఏటీఎం కార్డును పొగొట్టుకున్నా, ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్‌ ఈ విషయాన్ని నిర్థారించుకుని కొత్త కార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.

పాస్‌పోర్ట్:

పాస్‌ పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్‌ పోర్టు లభించకుంటే నాన్‌ ట్రేస్ట్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌ పోర్టు అధికారి, హైదరాబాద్‌ పేరిట రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తరువాత డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. తత్కాల్‌ పాస్‌ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు passportindia.gov.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

ఆధార్‌ కార్డు:

ఆధార్‌ కార్డు పోతే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18001801947 పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం, చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు. uidai.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. కార్డు ఏదైనా దాన్ని స్కాన్ చేయించి ఈ మెయిల్‌ అడ్రస్‌కు అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవడం చాలా మంచిది. ప్రధాన కార్డులను (ఏటీఎం కార్డులు కాదు) డూప్లికేట్‌ చేయించుకుని వీలైనంత వరకు వాటినే జేబులో పెట్టుకు తిరగాలి. సాధారణంగా పిక్‌పాకెటింగ్‌ జరుగుతుంది కావున ముఖ్యమైన కార్డులు పర్సులోకాకుండే ప్రత్యక వాలెట్‌లో పెట్టుకుంటే మంచిది. అన్నికార్డులు ఒకేచోట ఉంచేటప్పుడు వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.

పాన్‌కార్డు:

ఆర్థిక లావాదేవీల్లో పాన్‌కార్డు చాలా కీలకం. ఆదాయ పన్ను శాఖ అందించే పాన్ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు పాత పాన్‌ కార్డు జెరాక్స్‌, రెండు కలర్‌ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా మరో రూ.90 చెల్లించాలి. కొత్త కార్డు వచ్చేసరికి మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. దీని కార్యాలయం ద్వారకానగర్‌లో మెయిన్‌ రోడ్డులో ఉంది. అక్కడకు వెళ్లి అధికారులను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డు:

ఓటరు గుర్తింపు కార్డు కూడా బహుళ ప్రయోజనకారి. కేవలం ఓటు వేసేందుకేకాకుండా నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీన్ని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్‌బూత, కార్డు నంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నంబర్‌ ఆధారంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు సంబంధిత మరింత సమాచారం కోసం ఎన్నికల శాఖా వారి వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలను పొందవచ్చు.

తెలంగాణ ఎన్నికల శాఖా: ceotelangana.nic.in
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల శాఖా: ceoandhra.nic.in

Must Read: 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా…? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 51,329 times, 1 visits today)