Home / health / గొంతు నొప్పితో బాధపడుతున్నారా!….

గొంతు నొప్పితో బాధపడుతున్నారా!….

Author:

ఇది అసలే వర్షాకాలం ఇప్పుడు ఏ హాస్పిటల్స్ చూసినా కిక్కిరిసిన జనాలతో నిండుగా ఉంటాయి. అలాగే వార్షాకాలమనగానే మనకు గుర్తుకు వచ్చే మరో విషయం జలుబు, దగ్గు, వీటి వలన తీవ్రమైన గొంతు నొప్పి. మాములుగా జలుబు చేస్తే ఎలాంటి ట్యాబ్లేట్స్ వాడిన మినిమమ్ ఒక 4-6 రోజుల వరకు కచ్చితంగా ఉంటుంది. జలుబు ఉందంటే ఇక గొంతు నొప్పి గురించి చెప్పవల్సిన అవసరం లేనేలేదు. మరి ఇలాంటి గొంతు నొప్పి తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

1. ముందుగా మం ఇంట్లో ఉండే దొడ్డు ఉప్పును కొద్దిగా గోరు వెచ్చని నీటిలో కలిపి రోజులో నాలుగు సార్లు నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేయడం వలన గొంతు నొప్పి చాలా వాల్రకు తగ్గుతుంది.

2. అల్లంతో చేసిన టీ తాగడం, లేదా వేడి నీటిలో అల్లాణి వేసి ఆ నీటిని తాగడం వలన కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.

How to get rid of throat infection

3.కొద్దిగా వేడి చేసిన నీటిలో నిమ్మరసం, తేనే కలుపుకొని తాగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

4. రోజు ఉదయం పాలల్లో మిరియాలు కలుపుకొని తాగడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

5.దాల్చిన చెక్క, తేనే కలుపుకొని తాగిన మంచి ఫలితం ఉంటుంది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)