Home / Uncategorized / గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపవచ్చు.

గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపవచ్చు.

Author:

LPG గ్యాస్ లు వచ్చినప్పటి నుండి కట్టెలతో వంట చేయడం తగ్గిపోయింది, ఇప్పుడు మారుమూల గ్రామాలలో కూడా గ్యాస్ తోనే వంట చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్ ల వాడకంతో పాటు గ్యాస్ ప్రమాదాలు కూడా పెరిగిపోయాయి, గ్యాస్ సిలిండర్ పేలితే దాని చుట్టుపక్కల కొంతదూరం వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది, వంట చేసేటప్పుడు అజాగ్రత్తగా  నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గ్యాస్ లీక్ కావడం వల్ల ఎక్కువగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఒక్కసారి గ్యాస్ సిలిండర్ పేలితే దాని తీవ్రత కారణంగా అక్కడ ఉన్న మనుషులు చనిపోవచ్చు, లేదా తీవ్రంగా గాయపడవచ్చు అంత ప్రమాదకరం, కానీ కొంచెం సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తున్న సిలిండర్ పేలకుండా నియంత్రించవచ్చు. అగ్ని మాపక సిబ్బంది వారు గ్యాస్ ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలో ప్రజల మధ్యలోకి వచ్చి మాక్ డ్రిల్ లాగ చేసి చూపిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ లోపల గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు సిలిండర్ కి వేడి తగలకుండా చెయ్యాలి, సిలిండర్ లోపల ఉండే లిక్విడ్ ద్రవ రూపం ఉంది వాయు రూపంలోకి వస్తే సిలిండర్ పేలిపోయే ఆవకాశం ఉంటుంది, గ్యాస్ సిలిండర్ కి మంటలు అంటుకున్నప్పుడు అటు ఇటు నెట్టివేయకూడదు ఆలా చేస్తే సిలిండర్ కి వేడి తగిలి పేలిపోయే ఆవకాశం ఉంటుంది,  మంటలు ఆర్పిన తరువాత సిలిండర్ పై ఒక గోదాం బస్తా వేసి నీళ్లు పోయాలి.

(Visited 536 times, 1 visits today)